Fauji: ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ప్రభాస్ తనదైన రీతిలో ఇక్కడ గుర్తింపును సంపాదించుకున్నాదు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ల్లో భారీ గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచాడు. బాహుబలి 2 సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ఈ సినిమాతో మాత్రం దాదాపు 2000 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి ఇండియాలో అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక అదే ఊపు తో ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా కూడా భారీ కలెక్షన్లు రాబడుతూ ఇండియాలో నెంబర్ వన్ స్టార్ గా ప్రభాస్ నిలిపిందనే చెప్పాలి.
ఇక ఇప్పుడు ఈయన ‘హను రాఘవ పూడి’ దర్శకత్వంలో ‘ఫౌజీ ‘ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తెరకెక్కడమే కాకుండా భారీ వసూళ్లను కూడా రాబడుతుందనే అంచనాలైతే ఉన్నాయి. ఇక ‘సీతా రామం’ సినిమాతో హను రాఘవ పూడి ఒక కొత్త రకం లవ్ స్టోరీని ప్రేక్షకులకు పరిచయం చేసిన తీరు అందరికీ నచ్చింది. కాబట్టి ఆయన దర్శకత్వంలో నటించడానికి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకొని తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ప్రభాస్ ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. ఇప్పుడు ప్రభాస్ ఈ సినిమాతో భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ ని కూడా తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఈ సినిమా కోసం దాదాపు 250 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇంత భారీ రెమ్యూనరేషన్ ను తీసుకున్న ఇండియన్ హీరో ఎవరు లేరు కాబట్టి ప్రస్తుతం ప్రభాస్ నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక కొంతమంది నిర్మాతలు ప్రభాస్ కి బ్లాంక్ చెక్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దానిమీద తనకు ఇష్టం వచ్చినంత రాసుకొమ్మని కానీ మా బ్యానర్ లో మాత్రం ఒక సినిమా చేయమని ప్రొడ్యూసర్లు ప్రభాస్ ను కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఇండియాలో ఉన్న ప్రతి ప్రొడ్యూసర్ ప్రస్తుతం ప్రభాస్ తో ఒక సినిమా చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు… అంతటి ఘన కీర్తిని సాధించిన ప్రభాస్ మన తెలుగు హీరో కావడం నిజంగా తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ విషయమనే చెప్పాలి…