Danam Nagender: ‘దానం’ కోసం కష్టపడుతున్న రేవంత్.. ఉప ఎన్నికల్లో గెలిపించకపోతే కష్టమే మరీ

తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా.. కేటీఆర్‌ చెప్పిందే జరుగబోతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది పొలిటికల్‌ ఎక్స్‌పర్ట్స్‌ నుంచి. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌ నియోజకవర్గం ఖైతరాబాద్‌లో ఉప ఎన్నిక ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Written By: Raj Shekar, Updated On : September 23, 2024 4:39 pm

Danam Nagender

Follow us on

Danam Nagender: తెలంగాణలో అధికారం కోల్పోవడంతో బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ముగ్గురు లోక్‌సభ ఎన్నికల ముందు పార్టీ ఆమారగా, ఏడుగురు ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. దానం నాగేందర్‌ మొదట పార్టీ మారడంతోపాటు సికింద్రాబాద్‌ ఎంపీ స్థానానికి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేశారు. బీర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌ తరఫున ఎంపీగా పోటీ చేయడంపై అప్పట్లోనే చర్చ జరిగింది. దీనిపై బీఆర్‌ఎస్‌ కోర్టును ఆశ్రయించింది. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియ శ్రీహరిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పీకర్‌ కార్యాలయాన్ని ఆదేశించింది. దీంతో దానం కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయడం ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు మంచి ఆధారంగా మారింది. ఇటు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. దీంతో ఉప ఎన్నిక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పార్టీ మారడం కామన్‌..
సాధారణంగా ఎమ్మెల్యేలు పార్టీ మారడం కామన్‌. అధికారం ఎక్కడ ఉంటే.. అక్కడ చేరతారు. కానీ గతంలో ఎవరికీ రాని సమస్య ఇప్పుడు దానం నాగేందర్‌ ఎదుర్కొంటున్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్‌ తరఫున ఎంపీగా పోటీ చేయడం ఇప్పుడు ఇష్యూ మారింది. స్పీకర్‌ కూడా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దానం మినహా మిగతావారంతా అనర్హతను తప్పించుకునే అవకాశం ఉంది. కానీ, దానంపై వేటు తప్పదని తెలుస్తోంది. అందరికన్నా ముందు పార్టీ మారి, ఉప ఎన్నిక కోరి తెచ్చుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై కాంగ్రెస్‌లోనూ భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉప ఎన్నిక మంచిదే అని చాలా మంది అంటుండగా, ఇది పార్టీకి ఇబ్బంది కరమని మరికొందరు పేర్కొంటున్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోతే ప్రజల్లోకి రాంగ్‌ ఇండికేషన్‌ వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో పార్టీని గత ఎన్నికల్లో గెలిపించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పడు దానంకు కూడా వ్యతిరేకంగా ఓటు వేస్తే ప్రభుత్వ పనితీరుపై విమర్శలు వస్తాయని అంటున్నారు.

సమీపిస్తున్న గడువు..
ఇదిలా ఉంటే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి గడువు సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు తప్పవని స్పీకర్‌ కార్యాలయం కూడా సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఎన్నికలకు వెళ్లి గెలిస్తేనే పార్టీకి, ప్రభుత్వానికి మంచిదని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్పీకర్‌ దానంపై వేటు వేస్తారని సమాచారం. ఎన్నికల్లో దానంను గెలిపించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తుందని సమాచారం. ఈ క్రమంలో ఖైరతాబాద్‌ నియోజకవర్గంపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్లు తెలిసింది. వీలైనన్ని ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని సమాచారం.