Johnny Master: ప్రస్తుతం ఇండియా లో ఉన్న టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ లిస్ట్ తీస్తే అందులో జాన్ మాస్టర్ కచ్చితంగా నెంబర్ 1 స్థానం లో ఉంటాడు. టాలీవుడ్ తో పాటుగా, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ ఇలా ప్రతీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల సినిమాలకు ఈయన మాత్రమే కొరియోగ్రాఫర్ గా చేస్తున్నాడు. ‘అలా వైకుంఠపురంలో’ చిత్రంలో ‘బుట్ట బొమ్మ’ పాటకు అద్భుతమైన కొరియోగ్రఫీ చేసి నేషనల్ అవార్డు ని గెలుచుకున్న ఆయన, ఆ తర్వాత తమిళంలో ధనుష్ నటించిన ‘తిరు’ చిత్రంలోని ఒక పాటకు కొరియోగ్రఫీ చేసినందుకు గానూ మరోసారి ఆయనకీ నేషనల్ అవార్డు దక్కింది. ఇలా భాషతో సంబంధం లేకుండా ప్రతీ ఇండస్ట్రీ లో తన సత్తా చూపిస్తూ దూసుకొని పోతున్న జానీ మాస్టర్, చేతులారా తన బంగారం లాంటి భవిష్యత్తుని ఒక్క అమ్మాయి మోజులో పడి నాశనం చేసుకున్నాడు అనే చెప్పాలి. రీసెంట్ గానే శ్రేష్ఠి వర్మ అనే యంగ్ డ్యాన్సర్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని, పెళ్లి చేసుకోమని టార్చర్ చేస్తున్నాడని, అవుట్ డోర్ షూటింగ్స్ లో తనపై లైంగికంగా చాలా అసభ్యంగా వ్యవహరించాడు అంటూ నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఈ ఘటన ఇండస్ట్రీ లో ఎలాంటి దుమారం రేపిందో మన అందరికీ తెలిసిందే. దీనిపై ఫిలిం ఛాంబర్ కూడా చాలా తీవ్ర స్థాయిలో స్పందించింది. జానీ మాస్టర్ పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, శ్రేష్ఠి వర్మ కి అన్నీ విధాలుగా ఇండస్ట్రీ తోడు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇది ఇలా ఉండగా జానీ మాస్టర్ తెలుగు సినిమా కొరియోగ్రాఫర్స్ అస్సోసియేషన్ కి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన ఆరోపణలు ఎదురుకుంటున్న ఈ నేపథ్యంలో, నిజానిజాలు తేలేవరకు విధి నిర్వహణలకు దూరంగా ఉండాలని ఫిలిం ఛాంబర్ ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు విచారణ లో జానీ మాస్టర్ నిజంగానే తప్పు చేసినట్టు రుజువు అయితే, తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఆయనకీ కొరియోగ్రఫీ చేసుకునే అవకాశం కల్పించము అంటూ ఫిలిం ఛాంబర్ సభ్యులు హెచ్చరికలు జారీ చేసారు. ఇదంతా పక్కన పెడితే జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లో ఒక ముఖ్య నేతగా కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.
ఎప్పుడైతే జానీ మాస్టర్ మీద ఆ అమ్మాయి ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్ లో కేసు వేసిందో, వెంటనే స్పందించిన జనసేన పార్టీ జానీ మాస్టర్ ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇది జానీ మాస్టర్ కి పెద్ద షాక్ అనే చెప్పాలి. అయితే ఇంత జరుగుతున్నా కూడా జానీ మాస్టర్ అసలు ఏమి జరగనట్టు ఇప్పటి వరకు స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. మీడియా అతనిని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయగా, అతను అజ్ఞాతంలోకి వెళ్లినట్టు చెప్తున్నారు.