https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: పూర్తిగా సోనియా మాయలో పడిపోయిన నిఖిల్..టీం లో ఎవరికీ విలువ ఇవ్వట్లేదుగా!

గత వారం ఆయన పే మనీ టాస్కులలో అద్భుతంగా ఆడి గ్రాండ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఈ వారం కూడా ఆయన రేషన్ టాస్కులో చెలరేగి ఆడాడు. అయితే ఈ టాస్కులలో కూడా ఆయన ఎక్కువగా తన క్లాన్ లో ఒక సభ్యురాలిగా ఉన్నటువంటి సోనియా మాయలో పడిపోయాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 18, 2024 / 09:00 AM IST

    Bigg Boss 8 Telugu(45)

    Follow us on

    Bigg Boss 8 Telugu: ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో టాస్క్ కింగ్ గా పిలవబడే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది నిఖిల్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ టాస్కుని ఆయన ఎంతో కసిగా ఆడుతాడు. మొదటి వారం లో ఆయన ఎమోషనల్ గా బాగా డౌన్ అయ్యాడు. ప్రతీ ఒక్కరు ఆయనని ఎమోషన్స్ తో తెగ ఆడేసుకున్నారు. కటౌట్ చూస్తే ఈ రేంజ్ లో ఉంది, కానీ ఇతనేంటి ఎమోషనల్ గా ఇంత బలహీనంగా ఉన్నాడు అని హౌస్ లో కంటెస్టెంట్స్ తో పాటుగా చూసే ప్రేక్షకులకు కూడా అనిపించింది. కానీ గత వారం ఆయన పే మనీ టాస్కులలో అద్భుతంగా ఆడి గ్రాండ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఈ వారం కూడా ఆయన రేషన్ టాస్కులో చెలరేగి ఆడాడు. అయితే ఈ టాస్కులలో కూడా ఆయన ఎక్కువగా తన క్లాన్ లో ఒక సభ్యురాలిగా ఉన్నటువంటి సోనియా మాయలో పడిపోయాడు. మొదటి వారం నుండి నిఖిల్ ఆటకు సోనియా అడ్డు తగులుతూనే ఉంది. అతని గ్రాఫ్ మొదటి రెండు వారాలు బాగా తగ్గిపోవడానికి కారణం సోనియానే.

    మొత్తానికి ఆమె మాయలో నుండి బయటపడి టాస్కులు బాగా ఆడుతున్నాడులే అని అనుకునేలోపే మరోసారి ఆమె ట్రాప్ లో పూర్తిగా పడిపోయాడు నిఖిల్. అందుకు ఉదాహరణగా నిల్చింది నేడు జరిగిన టాస్క్. పూర్తి వివరాల్లోకి వెళ్తే రేషన్ టాస్కు లో భాగంగా బిగ్ బాస్ ‘నత్తలా సాగుకు..ఒక్కటి వదలకు’ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్కు కోసం ఇరు క్లెన్స్ నుండి చెరో ఇద్దరు కంటెస్టెంట్స్ పాల్గొనాలి. అభయ్ టీం లో ఎవరెవరు పాల్గొనాలి అనేది గ్రూప్ మొత్తం చర్చించుకొని నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా పద్దతిగా అనిపించింది. కానీ నిఖిల్ గ్రూప్ లో అలా లేదు. సోనియా నేను టాస్కు లో ఆడుతాను అని నిఖిల్ తో చెప్పగానే, మరో మారు ఆలోచించకుండా బిగ్ బాస్ కి నేను, సోనియా గేమ్ లో పాల్గొంటాము అని చెప్పేసాడు. బిగ్ బాస్ చెప్పేసిన తర్వాత కిరాక్ సీత ని అడుగుతున్నాడు, నువ్వు ఆడాలని అనుకున్నావా అని.

    అంటే క్లాన్ లో సోనియా ఏమి అడిగితే అది చేసేయాలా?, మిగతా సభ్యులు నిఖిల్ కి అసలు కంటెస్టెంట్స్ గా కూడా కనిపించడం లేదా అనేది తెలియాల్సి ఉంది. విష్ణు ప్రియా ఇప్పటి వరకు హౌస్ లో పెద్దగా టాస్కులు ఆడలేదు, ఆమెని ఆడుతావా అని అడిగి, గేమ్ లో పాల్గొనేలా చెయ్యొచ్చు కదా?, కనీసం ఆమెను మాట వరుసకు కూడా అడగలేదు. అంతే కాదు నిఖిల్ ని సోనియా చాలా కంట్రోల్ లో పెట్టేస్తుంది. అతను చీఫ్ గా తీసుకునే ప్రతీ నిర్ణయం లో సోనియా ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఇది ముమ్మాటికీ నిఖిల్ తన గేమ్ ని చెడగొట్టుకుంటున్నట్టే. ఈ విషయాన్ని ఆయన రాబోయే రోజుల్లో అయిన గమనిస్తాడో లేదో చూడాలి.