Ustaad Bhagat Singh: ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. కెరియర్ స్టార్టింగ్ లో వరుస విజయాలను అందుకున్న ఆయన ఒకానొక దశలో 10 సంవత్సరాలపాటు వరుస డిజాస్టర్లను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికి తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా తన నుంచి సినిమా వస్తే చాలు అని తన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించాడు. ఈ మూవీ పవన్ కళ్యాణ్ అభిమానులందరికి కన్నుల పండుగగా మారింది. మరి అలాంటి ఓజీ సినిమా తర్వాత ఆయన చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా భారీ విజయాన్ని సాధిస్తుందని వాళ్ళందరూ చాలా మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సక్సెస్ అవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ కి పెద్దగా వచ్చే గుర్తింపైతే ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు టాప్ పొజిషన్ లోనే ఉంటాడు. కాబట్టి ఆయనకు పెద్దగా వచ్చేది ఏమి ఉండదు. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నాడు.
కాబట్టి అతనికి కొంతవరకు మంచి మార్కెట్ క్రియేట్ అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల కంటే కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సక్సెస్ అవ్వడం దేవిశ్రీప్రసాద్ కి చాలా కీలకంగా మారబోతోంది. ఎందుకంటే గత సంవత్సరం వచ్చిన పుష్ప సినిమా తర్వాత దేవిశ్రీప్రసాద్ అంత పెద్ద భారీ సక్సెస్ సాధించలేదు. ఇక ఆయన మ్యూజిక్ అందించిన సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.
అందువల్ల ఈ సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకుంటే తప్ప దేవిశ్రీప్రసాద్ కి పెద్ద సినిమాల ఆఫర్లైతే రావు కాబట్టి ఈ మధ్యకాలంలో అనిరుధ్, తమన్ లు వాళ్ళ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ గొప్ప గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇక వాళ్ళతో పోటీ పడాలంటే దేవి శ్రీ ప్రసాద్ కి ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడం చాలా కీలకం కాబోతోంది…ఈ సినిమాతో సక్సెస్ రాకపోతే మాత్రం దేవి కెరియర్ డైలమాలో పడిపోతుందనే చెప్పాలి…