Mithali Raj: జెంటిల్మెన్ గేమ్ లాంటి క్రికెట్లో అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వారు స్థిరంగా నిలబడతారు. బలమైన కెరియర్ నిర్మించుకుంటారు . తద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సంపాదించుకొని.. ఉన్నతంగా ఎదుగుతారు. మన దేశ క్రికెట్ చరిత్రలో చాలామంది క్రికెటర్లు పేద కుటుంబం నుంచి వచ్చినవారు. ఆటలో నైపుణ్యం చూపించడం ద్వారా సరికొత్తగా ఎదిగారు. పేదరికం నుంచి శ్రీమంతుల స్థాయికి ఎగిశారు. ఈ జాబితాలో మొన్నటి వరకు పురుష క్రికెటర్లు ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మనదేశంలో మహిళా క్రికెట్ కు మంచి రోజులు వచ్చాయి. ఒకప్పుడు మహిళల క్రికెట్ అంతగా ఆదరణ ఉండేది కాదు. ఇటీవల కాలంలో యువ ప్లేయర్లు జట్టులోకి అడుగుపెట్టడంతో పరిస్థితి మారిపోయింది. మేనేజ్మెంట్ కూడా పురుష క్రికెటర్లతో సమానంగా చెల్లింపులు చేస్తున్న నేపథ్యంలో మహిళల క్రికెట్ గతి పూర్తిగా మారిపోయింది.
మనదేశంలో మహిళా క్రికెట్ కు గతంలో అంతగా ఆదరణ ఉండేది కాదు. కానీ ఇటీవల కాలంలో మన జట్టు వరుస విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో ప్లేయర్ల మీద విపరీతమైన నమ్మకం ఏర్పడింది. దీనికి తోడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అందుబాటులోకి రావడంతో మహిళలకు విపరీతమైన అవకాశాలు వస్తున్నాయి. వచ్చిన అవకాశాలను చాలామంది మహిళా ప్లేయర్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆటలో అద్భుతమైన నైపుణ్యాన్ని చూపించి అదరగొడుతున్నారు. తాజాగా వన్డే వరల్డ్ కప్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు.. ఈ నేపథ్యంలో మహిళ ప్లేయర్లు కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని భారీగా సంపాదిస్తున్నారు. ఇంకా కొంతమంది మహిళా ప్లేయర్లైతే వ్యాపారం లోకి అడుగుపెడుతున్నారు. సరికొత్త విధానాలలో వ్యాపారాలు చేస్తూ అదరగొడుతున్నారు.
నేటి కాలంలో స్మృతి, హర్మన్ టీమిండియా కు భవిష్యత్తు ఆశా కిరణాలుగా కనిపిస్తున్నప్పటికీ.. ఆట ద్వారా వీరు ఎంతోమంది మనసులు గెలుచుకున్నప్పటికీ.. ఆదాయపరంగా చూసుకుంటే మాత్రం వీరికి వెనక వరుసలోనే ఉన్నారు. ఎందుకంటే టీమ్ ఇండియాకు గుడ్ బై చెప్పినప్పటికీ.. మిథాలీ రాజ్ అత్యధికంగా సంపాదిస్తున్న మహిళ క్రికెటర్ గా పేరు తెచ్చుకుంది. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం మిథాలీ నికర ఆస్తుల విలువ 40 నుంచి 45 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పటికీ ఆమె చేతిలో అనేక కార్పొరేటర్ కంపెనీలతో ఒప్పందాలు ఉన్నాయి. క్రికెట్ ద్వారా ఆమె ఇప్పటికీ భారీగానే సంపాదిస్తుంది.. క్రికెట్ విశ్లేషకురాలిగా.. వ్యాఖ్యాతగా ఆమె అనేక పాత్రలను పోషిస్తున్నది. మిథాలీ రాజ్ తర్వాత స్మృతి రెండవ స్థానంలో ఉంది.
స్మృతి నికర ఆస్తుల విలువ 32 నుంచి 34 కోట్ల వరకు ఉంటుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు జట్టుకు సారధిగా స్మృతి వ్యవహరిస్తోంది. దీనికి తోడు ఆమె అనేక కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది . బెంగళూరు కెప్టెన్ గా ఆమెకు 3.4 కోట్లు లభిస్తున్నాయి. హ్యుందాయ్, నైక్, రెడ్ బుల్ వంటి కంపెనీలకు ఆమె ప్రచారకర్తగా ఉన్నారు. స్మృతి మందన 18 స్పోర్ట్స్ కేఫ్ పేరుతో జిమ్ నిర్వహిస్తున్నారు. ప్రైవేటు థియేటర్లు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.
టీమిడియాకు ప్రపంచకప్ అందించిన హర్మన్ బిసిసిఐ గ్రేడ్ ఏ కాంట్రాక్ట్ ద్వారా సంవత్సరానికి 50 లక్షలు లభిస్తాయి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ముంబై జట్టుకు నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో ఆమెకు 1.8 కోట్లు లభిస్తున్నాయి. అనేక కార్పొరేటర్ కంపెనీలతో ఆమె ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది.. పంజాబ్ రాష్ట్రంలో ఆమె పోలీస్ శాఖలో డిఎస్పీగా పని చేస్తున్నారు. పుమా, సీయట్, హెచ్డిఎఫ్సి లైఫ్, బూస్ట్ వంటి బ్రాండ్లకు ఆమె ప్రచారకర్తగా ఉన్నారు. హర్మన్ కు పంజాబ్లోని పాటియాలా, మహారాష్ట్రలోని ముంబై నగరాలలో గృహాలు ఉన్నాయి. విలాసవంతమైన కార్లు ఉన్నాయి. అత్యధిక సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి. సమకాలీన క్రికెట్లో భారత జట్టు తరుపు నుంచి మిథాలీ, స్మృతి, హర్మన్ భారీగా సంపాదిస్తున్న ప్లేయర్లుగా పేరు తెచ్చుకున్నారు.