Allu Sirish Engagement: ప్రస్తుతం యంగ్ హీరోలందరు వరుస సినిమాలతో సక్సెస్ లను సాధించి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటున్నారు. ఇక పర్సనల్ లైఫ్ లో పెళ్లి చేసుకోని సెటిల్ అయిపోవాలని చూస్తున్నారు… అందులో భాగంగానే అల్లు అరవింద్ కొడుకు, అల్లు అర్జున్ తమ్ముడు అయిన అల్లు శిరీష్ రీసెంట్ గా నైనికతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది… గత కొన్ని రోజుల నుంచి అల్లు అరవింద్ తన కొడుకు అయిన శిరీష్ పెళ్లి తొందరలోనే ఉంటుంది అంటూ చెబుతూ వస్తున్నాడు. ఎట్టకేలకు సడన్ సర్ప్రైజ్ ఇస్తూ అల్లు అరవింద్ తన ఇంట్లోనే వాళ్ళ శిరీష్ నైనిక ల ఎంగేజ్మెంట్ చేశారు. పెళ్లి ఎప్పుడు ఉంటుంది అనే దానిమీద క్లారిటీ రావాల్సి ఉంది.
మొత్తానికైతే నైనిక – అల్లు శిరీష్ గత రెండు సంవత్సరాల నుంచి పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళిద్దరిని కలిపింది మాత్రం హీరో నితిన్ అనే విషయం మనలో చాలామందికి తెలియదు… మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల పెళ్లి కుదిరిన తర్వాత నితిన్ అలాగే తన భార్య అయిన శాలిని వరుణ్ – లావణ్య లతో పాటు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది యంగ్ హీరోలను పిలిచి ఒక పార్టీ ఇచ్చారు.
ఆ పార్టీకి నితిన్ భార్య శాలిని వాళ్ళ ఫ్రెండ్ అయిన నైనిక కూడా ఆ పార్టీకి వచ్చింది. అప్పుడే అల్లు శిరీష్ తో ఆమెకి పరిచయం ఏర్పడింది. ఇంకా వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారి దాదాపు రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇక ఎట్టకేలకు ఇద్దరు ఇంట్లో పెద్దల్ని ఒప్పించి వాళ్ళ ప్రేమని పెళ్లిదాకా తీసుకొచ్చారు. మొత్తానికైతే నితిన్ తో పాటు తన భార్య అయిన శాలిని వల్లే శిరీష్ నైనికల ప్రేమ వ్యవహారం నడిచిందట.
అలాగే వాళ్ళ పెళ్లికి కూడా వీళ్ళు చాలా వరకు బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నారని మరి కొన్ని వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. మొత్తానికైతే నైనిక నితిన్ కి సిస్టర్ అవుతుందట…వాళ్ల దూరపు బంధువు కావడం వల్లే నితిన్ ఆమె కోసం చాలా రిస్క్ తీసుకున్నాడట… ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం యంగ్ హీరోలందరు పెళ్లి బాట పడుతూ ఒక ఇంటి వాళ్ళు అవుతుండడం చూస్తుంటే వాళ్ళ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…