Lokesh Kanagaraj: సినిమా ఇండస్ట్రీలో ఏ రోజు ఎవరు ఏ పరిస్థితుల్లో ఉంటారో ఎవరు చెప్పలేరు.ఎందుకంటే ఇక్కడ ఏ రోజు అనేది ఎలా మారుతుందో చెప్పడం కష్టం. ఒక సినిమా సక్సెస్ అయితే జీరో లో ఉన్నవాడు హీరో అయిపోతాడు, అలాగే ఒక్క సినిమా ఫ్లాప్ అయితే హీరోలో ఉన్న వాడు జీరో అయిపోతాడు. అందుకే ఇక్కడ ఎవరిని కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు.
లోకేష్ కనకరాజ్ గురించి చూసుకుంటే ఈయన తమిళం లో కొన్ని సినిమాలు తీసాడు, వాటిని తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమాల వల్ల ఆయన ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఈయన పేరుకి తమిళ ఇండస్ట్రీ డైరెక్టర్ అయినప్పటికీ ఈయనకి ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈయన డైరెక్షన్ లో సందిప్ కిషన్ హీరో గా వచ్చిన నగరం అనే సినిమాతో ఆయన డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు… ఈయన తీసిన నగరం సినిమా తెలుగులో పెద్దగా ఆడలేదు,కానీ తమిళంలో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది… ఇక ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత సందీప్ కిషన్ లోకేష్ కనకరాజుని తీసుకొని తెలుగులో వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ అయిన ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాడు. లోకేష్ కనకరాజు దగ్గర మంచి కథలు ఉన్నాయి సినిమా చేయండి అని సందీప్ కిషన్ ఆ ప్రొడ్యూసర్ ని అడిగాడు కానీ అప్పుడు ఆ ప్రొడ్యూసర్ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. ఆయన టాలెంట్ గురించి అప్పుడు ఎవ్వరికీ తెలియదు ఇక ఆ తర్వాత కార్తీ హీరోగా ఖైదీ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా తమిళ్ తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది లోకేష్ కనకరాజు పేరు తెలుగులో కూడా భాగానే పాపులర్ అయ్యాడు. ఇక ఆ తర్వాత మాస్టర్ అనే సినిమా తీశాడు కానీ ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. విజయ్ సినిమా తర్వాత ఆయన తీసిన విక్రమ్ సినిమా సూపర్ హిట్ అయింది.ఈ సినిమాతో కమల్ హాసన్ చాలా సంవత్సరాల తర్వాత ఒక బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టడనే చెప్పాలి. స్వతహాగా కమల్ హాసన్ ఫ్యాన్ అయిన లోకేష్ ఈ సినిమాని ఒక ఫ్యాన్ ఎలాగైతే ఊహించుకొని తీస్తాడో అంతకుమించి ఈ సినిమాని తెరకెక్కించాడు. అందుకే ఈ సినిమా తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయింది…అలాగే తెలుగు లో కూడా సూపర్ సక్సెస్ అయింది….