Bigg Boss 7 Telugu: తెలుగు బుల్లితెర పై సంచలనం సృష్టించిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’.ఇతర దేశాల్లో ఎప్పటి నుండో నడుస్తున్న ఈ రియాలిటీ షో, తొలుత బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది,సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత ఇతర బాషలలో కూడా ప్రారంభించారు.అన్ని బాషలకంటే లేట్ గా ప్రారంభం అయ్యింది మన తెలుగులోనే, ఇక్కడి ఆడియన్స్ నచ్చుతారా లేదా అనే సందేహం తోనే ప్రారంభించారు, కానీ అన్నీ భాషల్లో కంటే కూడా ఇక్కడే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అత్యధిక TRP రేటింగ్స్ వచ్చింది కూడా మన తెలుగులోనే,అలా ఆరు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. 5 సీజన్స్ వరకు ఒక దానిని మించి ఒకటి హిట్ అవ్వగా, ఆరవ సీజన్ మాత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది. నిర్వాహకులు ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ని సరైన వాళ్ళని ఎంచుకోకపోవడం వల్లే ఇలాంటి ఫలితం వచ్చిందని అంటుంటారు విశ్లేషకులు.
సీజన్ 6 ఫ్లాప్ అయ్యేలోపు సీజన్ 7 ఉంటుందా లేదా అనే సందేహం లో ఉండేవారు ప్రేక్షకులు.ఎందుకంటే ఈపాటికి సీజన్ గురించి ఎదో ఒక న్యూస్ రావాలి,కానీ ఎలాంటి న్యూస్ ఇప్పటి వరకు రాలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ లో కూడా సెట్ వర్క్ కి సంబంధించిన ఏ కార్యక్రమం కూడా మొదలు కాలేదు.
దాంతో ఈ సీజన్ ఉండదు అనే అనుకున్నారు అందరూ,కానీ ఈ సీజన్ కచ్చితంగా ఉంటుందని, ఇది వరకు ఎన్నడూ జరగని విధంగా ఈ సీజన్ ని నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారని. సెప్టెంబర్ 10 వ తారీఖు నుండి ఈ సీజన్ ప్రారంభం కానుంది అని తెలుస్తుంది. అయితే ఈ సీజన్ కి మాత్రం అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించడట.బాలయ్య బాబు దాదాపుగా కర్తారం అయ్యినట్టు తెలుస్తూయింది..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.