Imran Khan’s Arrest : ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో వేడెక్కిన పాకిస్తాన్ రాజకీయాలు

ఇమ్రాన్ ఖాన్ ఒక తిరుగుబాటు ధోరణిని ప్రదర్శిస్తున్నారు. నేను సహకరించను అంటూ ప్రభుత్వానికి తెగేసి చెబుతున్నాడు. మీరు తిరుగుబాటు చేయండి అంటూ తనపార్టీ శ్రేణులు, సానుభూతిపరులను కోరుతున్నారు. ప్రజలను సైతం ఇమ్రాన్ రెచ్చగొడుతున్నాడు.

Written By: NARESH, Updated On : May 11, 2023 6:55 pm
Follow us on

Imran Khan’s Arrest : పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారింది. అంతర్యుద్ధం దిశగా పాకిస్తాన్ వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ఏ విధంగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారో చూశాం. ఇన్నాళ్ల నుంచి ఏదో విధంగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళుతూనే ఉన్నారు. కోర్టులకు ఎక్కి తప్పించుకుంటూ వస్తూనే ఉన్నారు. ఎందుకింత గొడవ జరిగింది. ఇమ్రాన్ అరెస్ట్ తో పాకిస్తాన్ అట్టుడికి పోయింది. ఆర్మీ జనరల్ ఇంటి మీదకు, ఐఎస్ఐ చీఫ్ ఇంటి మీదకు వెళ్లి మరీ దాడులు జరిగాయి. ఆర్మీ మీద దాడులు ఎప్పుడూ వినలేదు.

దీనంతటికి కారణం ఏంటంటే.. ఇమ్రాన్ ఖాన్ ఒక తిరుగుబాటు ధోరణిని ప్రదర్శిస్తున్నారు. నేను సహకరించను అంటూ ప్రభుత్వానికి తెగేసి చెబుతున్నాడు. మీరు తిరుగుబాటు చేయండి అంటూ తనపార్టీ శ్రేణులు, సానుభూతిపరులను కోరుతున్నారు. ప్రజలను సైతం ఇమ్రాన్ రెచ్చగొడుతున్నాడు.

నన్ను అరెస్ట్ చేస్తే పాకిస్తాన్ లో వీధుల్లోకి వచ్చి కొట్లాడండి అంటూ ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చాడు. దీంతో పాక్ లో నిరసనలు మిన్నంటుతున్నాయి. ఎప్పుడూ లేనంతగా అంతర్యుద్ధం చోటు చేసుకుంటోంది.

ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో వేడెక్కిన పాకిస్తాన్ రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..