Sonam Kapoor: ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ ఈ రోజు ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తనకు కొడుకు పుట్టాడంటూ ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ‘ఆగస్టు 20, 2022.. ముద్దులొలుకుతున్న బాబు మా ముందుకు వచ్చాడు. ఈ అద్భుతమైన జర్నీలో నాకు తోడ్పడిన ప్రతి ఒక్కరికీ.. ముఖ్యంగా డాక్టర్స్, నర్సులు, అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కు నా ధన్యవాదాలు. ఇది ప్రారంభం మాత్రమే, బాబు రాకతో మా ప్రపంచమే మారిపోయింది అంటూ సోనమ్, తన భర్త ఆనంద్ తో కలిసి ఈ మెసేజ్ ను పోస్ట్ చేసింది.

ఇక సోనమ్ కపూర్ కి కుమారుడు పుట్టడంతో ఆమె అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోనమ్, ఆనంద్ అహుజాలు 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. మొత్తానికి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సోనమ్ .. ఇటీవల సీమంతం కూడా గ్రాండ్ గా చేసుకుంది. అయితే, సోనమ్ కు అందం ఉన్నా, అణుకువ ఉన్నా, అన్నిటికీ మించి మంచితనం ఉన్నా.. ఉన్నతమైన సినిమాలు ఆమె చెంతకు చేరలేదు.
సోనమ్ కపూర్ చాలా కాలంగా సెకెండ్ లెవల్ హీరోయిన్ గానే మిగిలిపోయింది. దాంతో ఈ హోమ్లీ బ్యూటీ ఎక్కువ సినిమాల్లో నటించలేదు. కొన్ని చిత్రాల్లో నటించింది. కానీ.. ఏ చిత్రం సోనమ్ కెరీర్ ను టర్న్ చేయలేకపోయింది. ఎలాగూ సినీ కెరీర్ బాగాలేదు కాబట్టే.. ఆమె పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది.

అయితే, తాను స్టార్ హీరోయిన్ కాలేకపోయాను అని సోనమ్ ఇప్పటికీ బాధ పడుతూ ఉంటుందట. తన తండ్రి అనిల్ కపూర్ తనకు ఎంతో సపోర్ట్ అందించినా స్టార్ గా రాణించలేకపోయాను అని సోనమ్ కపూర్ బాగా ఫీల్ అవుతూ ఉంటుందట. బాలీవుడ్ లో సీనియర్ హీరో అనిల్ కపూర్ ది ప్రత్యేక శైలి. ఫ్యామిలీ హీరోగా ఆయనకు మంచి ఇమేజ్ ఉంది.
ఆ ఇమేజ్ కి తగ్గట్టుగానే అనిల్ కపూర్ కూడా పూర్తి ఫ్యామిలీ మెన్. ముఖ్యంగా ఆయనకు తన కుమార్తెలు అంటే ప్రాణం. అందుకే, వారి ఇష్టాన్ని ఎప్పుడు కాదు అనలేదు అనిల్. సోనమ్ కపూర్ హీరోయిన్ అయ్యాక, ఎక్స్ పోజింగ్ లో పరిధి దాటినా, తనను అందరూ హేళన చేస్తోన్నా అనిల్ కపూర్ మాత్రం కూతురు పై ఇష్టంతో ఆమె హీరోయిన్ కెరీర్ కి ఎలాంటి అడ్డు చెప్పలేదు. అయినా సోనమ్ మాత్రం స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కానీ ప్రస్తుతం ఆమె తల్లి అయ్యింది.
Also Read:Shankar – Ram Charan movie: రామ్ చరణ్ కి షాక్ మీద షాక్ ఇస్తున్న శంకర్..ఆ ఇద్దరు సినిమా నుండి అవుట్?
[…] […]