Megastar Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ పై మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఆ గస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ రోజు కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కారణం మెగాస్టార్ సినిమాల నుంచి క్రేజీ అప్ డేట్స్ వస్తాయని. అయితే, ప్రస్తుతం మెగాస్టార్ చేస్తున్న చిత్రాల్లో ‘గాడ్ ఫాదర్’ ఒక్కటి. కాగా ఈ సినిమా నుంచి మెగా బర్త్ డే సందర్భంగా ‘గాడ్ ఫాదర్’ టీజర్ ను ఆగస్టు 21న సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌లో చిరు చైర్ పై కూర్చుని పవర్ ఫుల్ గెటప్ లో కనిపిస్తున్నారు. పోస్టర్‌ను బట్టి.. గాడ్ ఫాదర్ టీజర్ ఇంటెన్స్‌గా ఉండబోతోంది. అన్నట్టు ఈ సినిమాలో చిరంజీవి తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించనున్నారు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: Shankar – Ram Charan movie: రామ్ చరణ్ కి షాక్ మీద షాక్ ఇస్తున్న శంకర్..ఆ ఇద్దరు సినిమా నుండి అవుట్?
ఇక ఈ సినిమాతో ఐయామ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ యాక్షన్ లో దిగడంతో సినిమా పనుల్లో స్పీడ్ డబుల్ అయింది. ఈ సినిమాలో మెగాస్టార్ ప్లాష్ బ్యాక్ లో స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నాడట. పైగా సినిమాలో మంచి ఎమోషన్స్ ను కూడా యాడ్ చేశారని.. మెగాస్టార్ కి, మెగాస్టార్ తండ్రి పాత్రకు మధ్య బలమైన ఎమోషనల్ సీన్స్ ఉంటాయట.
మెగాస్టార్ ఫాదర్ గా సీనియర్ నటుడు విజయ్ చందర్ నటించబోతున్న సంగతి తెలిసిందే. అంటే సీఎం పాత్రలో విజయ్ చందర్ కనిపించబోతున్నాడు అన్నమాట. ఈ పాత్ర చనిపోయాకే మెగాస్టార్ హీరోయిజమ్ ఎలివేట్ అవుతుంది. నిజానికి మెగాస్టార్ చేస్తున్న సినిమాల్లోనే ఫుల్ క్రేజ్ ఉన్న సినిమా కావడంతో ఈ చిత్రం పై చిరు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే, పక్కా హీరోయిజమ్ తో సాగే సినిమా ఇది, అందుకే ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాలోని కీలకమైన యాక్షన్ సీన్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. మొత్తానికి బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు అవ్వడం ఖాయం. కాగా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి తమన్ స్వరాలందిస్తుండగా.. నిరవ్ షా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.