Balakrishna: నందమూరి బాలకృష్ణ కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మాస్ లో ఈయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ టాలీవుడ్ లో మరో స్టార్ హీరో కి లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికీ ఈయన సినిమా హిట్ అయ్యింది అంటే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ షేక్ అవుతాయి.అంతటి స్టార్ స్టేటస్ ఉన్న బాలయ్య అంటే కేవలం ప్రేక్షకుల్లోనే కాదు, సినిమా ఇండస్ట్రీ లోను సెలబ్రిటీస్ లో మంచి క్రేజ్ ఉంది.
యువ హీరోలు ఈయనతో కలిసి ఒక సినిమాలో నటిస్తే చాలు అన్నట్టుగా ఉంటారు, వాళ్ళు నటించడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కానీ ఇండియాలోనే ఒక బడా సూపర్ స్టార్ బాలయ్య సినిమాలో నటించేందుకు తనకి వచ్చిన వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఆఫర్ ని కూడా పక్కన పెట్టి బాలయ్య తో నటించడానికి ముందుకు వచ్చాడని ఒక వార్త సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతుంది.
ఆ బడా సూపర్ స్టార్ మరెవరో కాదు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య కి విలన్ గా అక్షయ్ కుమార్ నటించబోతున్నాడట. అనిల్ రావిపూడి వెళ్లి అడగంగానే ఎంతో సంతోషం తో అక్షయ్ కుమార్ ఈ చిత్రం లో విలన్ గా నటించడానికి ఒప్పుకున్నాడట. బాలీవుడ్ లో స్టార్ హీరో గా కొనసాగుతూ, బాలయ్య కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే అక్షయ్ కుమార్ ఇలా అడగంగానే ఒప్పుకోవడానికి కారణం బాలయ్య మీద ఉన్న అభిమానమే అట.
గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి కి కూడా ఇలాగే ‘గాడ్ ఫాదర్’ సినిమాలో సల్మాన్ ఖాన్ రూపాయి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించాడు.ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా అదే చేసాడు, ఈ చిత్రం కోసం ఆయన బాలీవుడ్ లో వంద కోట్ల పారితోషికం ఇచ్చే సినిమాని కూడా వదిలేసుకున్నాడట, ఇందులో ఎంతమాత్రం నిజం ఉందొ తెలియాల్సి ఉంది.