Sreemukhi: శ్రీముఖి ప్రస్తుతం స్టార్ యాంకర్. ఏక కాలంలో ఐదారు షోలకు ఆమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకొని ఈ రంగంలో దూసుకువెళుతున్నారు. అయితే శ్రీముఖి దశాబ్దం క్రితమే స్టార్ కావాల్సిందట. ఓ దర్శకుడు సలహాతో ఆమె కెరీర్ నాశనం చేసుకున్నారట. అది ఎవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. వెండితెర మీద రాణించాలంటే బుల్లితెర జోలికి పోవద్దు. అలా చేస్తే హీరోయిన్ కాలేవంటూ ఒక ఉచిత సలహా పడేశాడట.
శ్రీముఖి కెరీర్ మొదలైంది నటిగానే. ఆ క్రమంలో ఆమెకు చిన్న చిన్న వేషాలు వచ్చాయి. జులాయి మూవీలో త్రివిక్రమ్ హీరో అల్లు అర్జున్ చెల్లి పాత్రను శ్రీముఖికి ఇచ్చాడు. ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో జులాయిలో శ్రీముఖి నటించిన విషయం కూడా ఎవరికీ తెలియదు. ఈ సినిమా షూటింగ్ సమయంలో త్రివిక్రమ్ తో ఆమెకు పరిచయం ఏర్పడిందట. అప్పటికే ఆఫర్స్ రాక విసిగిపోయిన శ్రీముఖి యాంకర్ గా ప్రయత్నాలు మొదలుపెట్టారట.
అప్పుడు బుల్లితెర వైపుకు వెళ్ళకు. అది నీ కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. హీరోయిన్ ఎప్పటికీ కాలేవని సలహా ఇచ్చాడట. ఆయన మాటలు నమ్మి కొన్నేళ్లు శ్రీముఖి యాంకరింగ్ కి దూరంగా ఉన్నారట. త్రివిక్రమ్ సలహా మేరకు ఎన్నాళ్ళు ఎదురు చూసినా బ్రేక్ రాలేదట. దాంతో చేసేది లేక మరలా యాంకర్ గా ప్రయత్నాలు మొదలు పెట్టి సక్సెస్ అయ్యారట. త్రివిక్రమ్ అప్పుడు అలా చెప్పకుండా ఉండి ఉంటే ఇంకా ముందే శ్రీముఖి స్టార్ అయ్యేవారని కొందరి వాదన.
యాంకర్ గా వచ్చిన గుర్తింపుతో శ్రీముఖికి సినిమా ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. క్రేజీ అంకుల్, ఇట్స్ టైం టు పార్టీ చిత్రాల్లో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. అయితే చిన్న చిత్రాలలో ఇకపై నటించకూడదని ఆమె డిసైడ్ అయ్యారట. అందుకే కొంచెం పేరున్న దర్శకులు, నటులతో పని చేయాలని వేచి చూస్తున్నారట. హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తూనే స్టార్ హీరోల చిత్రాల్లో కీలక రోల్స్ చేస్తున్నారు. శ్రీముఖి కెరీర్ మూడు పూలు ఆరు కాయలుగా ఉంది. నెక్స్ట్ ఆమె భోళా శంకర్ మూవీలో ఓ సర్ప్రైజింగ్ రోల్ లో కనిపించనున్నారట. ఈ చిత్రంలో ఆమె పాత్రలో పరిశ్రమలో పలు వాదనలు వినిపిస్తున్నాయి.