https://oktelugu.com/

Producer Suresh Babu: సొంత కొడుకు సినిమాని విడుదల చేసుకోలేని పరిస్థితి లో సురేష్ బాబు..పాపం ఇలా ఐపోయాడేంటి!

సినిమాల్లోని పాటలు మరియు ప్రోమోలు బాగా క్లిక్ అయ్యినప్పటికీ కూడా బయ్యర్స్ ఈ సినిమాని కొనేందుకు ముందుకు రావడం లేదు. ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7 వ తారీఖున విడుదల చేద్దాం అనుకున్నారు, కానీ కుదర్లేదు.ఆ తర్వాత ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22 వ తారీఖున వాయిదా వేశారు. ఆ డేట్ కి కూడా కొన్ని అనుకోని కారణాల వల్ల రాలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని జూన్ 2 వ తేదికి వాయిదా వేసినట్టు తెలుస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : May 10, 2023 / 06:04 PM IST

    Producer Suresh Babu

    Follow us on

    Producer Suresh Babu: దగ్గుపాటి సురేష్ రెండవ తనయుడు, దగ్గుపాటి రానా తమ్ముడు దగ్గుపాటి అభిరామ్ హీరో గా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం ‘అహింస’. గీతికా తివారి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో సదా, జేడీ చక్రవర్తి , రజిత్ భేడి, కమల్ కామరాజు మరియు బిందు చక్రవర్తి వంటి వారు ముఖ్యపాత్రలు పోషిస్తుండగా, ప్రముఖ దర్శకుడు తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

    ఇది వరకే తేజ తెలుగు లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తీసి, ఎంతో మంది టాలెంటెడ్ హీరోయిన్స్ ని మరియు హీరోస్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. గతం లో రానా దగ్గుపాటి ని హీరో గా పెట్టి ‘నేనే రాజు..నేనే మంత్రి’ అనే సూపర్ హిట్ సినిమాని కూడా తీసాడు. తేజ సినిమా అంటే మార్కెట్ లో కొంత డిమాండ్ కచ్చితంగా ఉంటుంది, కానీ ఈ అహింస చిత్రానికి మాత్రం బిజినెస్ సూన్యం అని తెలుస్తుంది.

    సినిమాల్లోని పాటలు మరియు ప్రోమోలు బాగా క్లిక్ అయ్యినప్పటికీ కూడా బయ్యర్స్ ఈ సినిమాని కొనేందుకు ముందుకు రావడం లేదు. ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7 వ తారీఖున విడుదల చేద్దాం అనుకున్నారు, కానీ కుదర్లేదు.ఆ తర్వాత ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22 వ తారీఖున వాయిదా వేశారు. ఆ డేట్ కి కూడా కొన్ని అనుకోని కారణాల వల్ల రాలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని జూన్ 2 వ తేదికి వాయిదా వేసినట్టు తెలుస్తుంది.

    సురేష్ బాబు లాంటి నిర్మాత నిర్మించిన సినిమాకి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి, తన జోబీలో నుండి రూపాయి కూడా వృధా అవ్వడానికి ఇష్టపడని సురేష్ బాబు, ఈ చిత్రాన్ని మంచి ఔట్పుట్ కోసం మాత్రమే వాయిదా వెయ్యిస్తున్నాడని, సినిమా కి బిజినెస్ జరగక మాత్రం కాదని అంటున్నాడట. మరి ఈ అహింస చిత్రం జూన్ 2 వ తేదీన అయినా విడుదల అవుతుందా లేదా అనేది చూడాలి.