https://oktelugu.com/

Darshan: 80 రోజులుగా జైల్లో మగ్గిపోతున్న స్టార్ హీరో, హ్యాపీగా జల్సాలు చేస్తున్న భార్య, ఆమె చేసిన పనికి అందరూ షాక్!

స్టార్ హీరో మర్డర్ కేసులో జైలులో మగ్గిపోతున్నాడు. కానీ ఆయన భార్య బయట హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. పార్టీల్లో పాల్గొంటుంది. చిత్ర పరిశ్రమలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. విషయంలోకి వెళితే...

Written By:
  • S Reddy
  • , Updated On : September 10, 2024 / 02:00 PM IST

    Darshan(1)

    Follow us on

    Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీప జైలుపాలైన సంగతి తెలిసిందే. దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడకు రేణుక స్వామి అనే వ్యక్తి సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాలు పంపారు. రేణుక స్వామి హీరో దర్శన్ కి వీరాభిమాని. పవిత్ర గౌడ కారణంగా దర్శన్ ఇమేజ్ కి భంగం కలుగుతుందన్న కోపంతో, ఆమెకు అసభ్యకర సందేశాలు పంపాడు. తనను రేణుక స్వామి వేధిస్తున్నాడని దర్శన్ కి పవిత్ర గౌడ ఫిర్యాదు చేసింది. తీవ్ర ఆగ్రహానికి గురైన దర్శన్ రేణుక స్వామిని కిడ్నాప్ చేయించాడు.

    రేణుక స్వామిని ఓ ప్రదేశంలో హింసించి చంపారు. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతో పాటు సంబంధం ఉన్న కొందరు వ్యక్తులను బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 2024 జూన్ నెలలో అరెస్ట్ కాగా దర్శన్ దాదాపు మూడు నెలలుగా జైలులో ఉన్నారు. అతడికి బెయిల్ రావడం లేదు. కనీసం ఇంటి భోజనం తెప్పించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా కోర్టు తిరస్కరించింది.

    భర్త జైలు జీవితం గడుపుతుంటే ఆయన భార్య విజయలక్ష్మి మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. తాజాగా విజయలక్ష్మి ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి హాజరైంది. పార్టీలో ఫ్రెండ్స్ తో ఆహ్లాదంగా గడుపుతున్న విజయలక్ష్మి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భర్త జైల్లో అష్టకష్టాలు పడుతుంటే విజయలక్ష్మి మాత్రం ఎంజాయ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

    కాగా 2003లో దర్శన్ విజయలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక అబ్బాయి సంతానం. కాగా 2011లో విజయలక్ష్మి దర్శన్ మీద కేసు పెట్టింది. మానసిక, శారీరక వేదనకు గురి చేస్తున్నాడని గృహహింస చట్టం క్రింద కేసు పెట్టింది. ఈ కేసులో అరెస్ట్ అయిన దర్శన్ 14 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. 2016లో మరొకసారి దర్శన్ పై ఆమె కేసు పెట్టారు.

    దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ-విజయలక్ష్మి తరచుగా వాదులాడుకుంటూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. దర్శన్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు పవిత్ర గౌడ షేర్ చేసి విజయలక్ష్మిని ఉడికిస్తూ ఉంటుంది.

    దర్శన్ అరెస్ట్ నేపథ్యంలో అభిమానులు తీవ్ర వేదనకు గురి అవుతున్నారు. గత ఏడాది దర్శన్ హీరోగా నటించిన కాటేరా భారీ విజయం అందుకుంది. ఇటీవల దర్శన్ జైలులో సిగరెట్ తాగుతూ ఫ్రెండ్స్ తో జల్సాలు చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఇది వివాదాస్పదమైంది. సదరు ఫోటోలపై విచారణకు కోర్టు ఆదేశించింది. కెరీర్ బిగినింగ్ నుండి దర్శన్ అనేక వివాదాల్లో ఉన్నారు. దర్శన్ దుందుడుకు స్వభావం కలిగి ఉన్నాడు.