https://oktelugu.com/

Gudumba Shankar: ‘గుడుంబా శంకర్’ చిత్రానికి 20 ఏళ్ళు..ఫ్లాప్ టాక్ తో ఆరోజుల్లో ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

నాగబాబు నిర్మాతగా అంజనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించాడు. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలను అందుకోవడం విఫలం అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 10, 2024 / 02:05 PM IST

    Gudumba Shankar

    Follow us on

    Gudumba Shankar: పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉండొచ్చు, ఫ్లాప్స్ ఉండొచ్చు కానీ, ఆయన అభిమానులకు ఫలితాలతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు మధురమైన జ్ఞాపకాలను మిగిలించాయి. అలాంటి చిత్రాలలో ఒకటి ‘గుడుంబా శంకర్’. సుస్వాగతం నుండి ఖుషి వరకు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకొని నెంబర్ 1 దిశగా అడుగులేస్తున్న పవన్ కళ్యాణ్ కి ‘జానీ’ చిత్రం మొట్టమొదటి ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ కి కూడా ఫ్లాప్స్ పడుతాయా అని అనుకునేవారు అప్పట్లో. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ దర్శకత్వం కూడా వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆయన ఎంతో ఇష్టపడి చేసిన చిత్రాలలో ఒకటి ‘గుడుంబా శంకర్’. ఈ సినిమాకి ఆయన కథ, స్క్రీన్ ప్లే అందించగా, వీర శంకర్ దర్శకత్వం వహించాడు.

    నాగబాబు నిర్మాతగా అంజనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించాడు. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలను అందుకోవడం విఫలం అయ్యింది. పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ లో కనిపించేలోపు ఈ సినిమా పవర్ ఫుల్ మాస్ సబ్జెక్టు అని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ థియేటర్ లోపలకు వెళ్లిన తర్వాత అది ఒక కామెడీ సినిమా అని అర్థం అవ్వడంతో అభిమానులు తీసుకోలేకపోయారు. అయినప్పటికీ కూడా ఈ సినిమా అప్పట్లో 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ మార్కుని దాటిందని డైరెక్టర్ వీర శంకర్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఈ సినిమా విడుదలకు ముందు ఆంధ్ర ప్రదేశ్ యూత్ మొత్తం డబుల్ ప్యాంట్స్ ట్రెండ్ ని ఫాలో అయ్యింది. పాటలు కూడా సినిమా విడుదలకు ముందే అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ఓపెనింగ్స్ సర్వసాధారణం. ఈ సినిమాకి హైప్ విపరీతంగా ఉండడం తో అనేక ప్రాంతాలలో ఆల్ టైం రికార్డ్స్ కూడా నెలకొన్నాయి.

    అయితే ఈ చిత్రానికి ఫ్లాప్ టాక్ రావడానికి ప్రధాన కారణాలలో ఒకటి పవన్ కళ్యాణ్ హీరోయిజం ని పూర్తిగా పక్కన పెట్టేయడమే. అంతే కాదు అప్పట్లో పవర్ ఫుల్ విలన్స్ గా పేరు తెచ్చుకున్న ఆశిష్ విద్యార్థి, షియాజీ షిండే చేత కామెడీ చేయించడం, వాళ్ళ చేత డ్యాన్స్ కూడా చేయించడం అందరినీ షాక్ కి గురి చేసింది. అప్పట్లో ఒక ప్యాజేజి లాగ ఒకేసారి ఇన్ని రకాల వెరైటీ కాన్సెప్ట్స్ ని పెట్టేలోపు ఆడియన్స్ వెంటనే స్వీకరించలేకపోయారు. కానీ ఈ సినిమాకి ఉపయోగించిన స్క్రీన్ ప్లే ఫార్ములా కి హీరోయిజం ని జోడించి శ్రీను వైట్ల తన కెరీర్ ని మొత్తం నడిపించేసాడు. అలా టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ గా నిల్చిన గుడుంబా శంకర్ విడుదలై నేటికి 20 ఏళ్ళు పూర్తి అయ్యింది.