https://oktelugu.com/

Sai Kumar: డబ్బింగ్ విషయంలో సాయి కుమార్ ని బెదిరించి నష్టపోయిన స్టార్ హీరో… చివరికి తల్లి డైరీ చూసి!

సూపర్ స్టార్ గా తెలుగులో కూడా సమాన ఇమేజ్ ఉన్న కోలీవుడ్ హీరో రజినీకాంత్ కి సింగర్ మను డబ్బింగ్ చెబుతారు. రజినీకాంత్ కి మను వాయిస్ చక్కగా సూట్ అవుతుంది. కాగా ఒకప్పటి స్టార్ హీరో రాజశేఖర్ కెరీర్ మొత్తం డబ్బింగ్ ఆర్టిస్ట్స్ మీదే ఆధారపడ్డారు. మంచి ఫిజిక్, గాంభీర్యం, మ్యాన్లీ నెస్ కలిగిన రాజశేఖర్ వాయిస్ మాత్రం చాలా పూర్ గా ఉంటుంది. ఆయన కట్ అవుట్ కి వాయిస్ కి ఏ మాత్రం సంబంధం ఉండదు.

Written By: , Updated On : May 16, 2023 / 08:19 AM IST
Sai Kumar

Sai Kumar

Follow us on

Sai Kumar: పరిపూర్ణ నటుడని నిరూపించుకోవడానికి చాలా విషయాలు అవసరం. ముఖ్యంగా గంభీరమైన గొంతు, స్పష్టమైన పలుకు, డైలాగ్ డెలివరీ నటనలో అతి ముఖ్యమైన భాగం. మంచి నటుడైనా వాయిస్ లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్స్ ని పెట్టుకుంటారు. ఒక హీరోకి ఎవరి గొంతు అయితే బాగా సూట్ అవుతుందో వాళ్ళను కొనసాగిస్తారు. తమిళ నటులు సూర్య, విక్రమ్ లకు తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్స్ వాయిస్ అరువిస్తారు. సూర్యకు డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి వాయిస్ బాగా సెట్ అవుతుంది. ఇటీవల ఆయన మరణించాడు. సూర్య చాలా బాధపడ్డాడు.

సూపర్ స్టార్ గా తెలుగులో కూడా సమాన ఇమేజ్ ఉన్న కోలీవుడ్ హీరో రజినీకాంత్ కి సింగర్ మను డబ్బింగ్ చెబుతారు. రజినీకాంత్ కి మను వాయిస్ చక్కగా సూట్ అవుతుంది. కాగా ఒకప్పటి స్టార్ హీరో రాజశేఖర్ కెరీర్ మొత్తం డబ్బింగ్ ఆర్టిస్ట్స్ మీదే ఆధారపడ్డారు. మంచి ఫిజిక్, గాంభీర్యం, మ్యాన్లీ నెస్ కలిగిన రాజశేఖర్ వాయిస్ మాత్రం చాలా పూర్ గా ఉంటుంది. ఆయన కట్ అవుట్ కి వాయిస్ కి ఏ మాత్రం సంబంధం ఉండదు.

రాజశేఖర్ కి సాయి కుమార్ డబ్బింగ్ చెప్పేవారు. చాలా మంది ఆ గంభీరమైన వాయిస్ రాజశేఖర్ సొంతం అనుకుంటారు. సాయి కుమార్ గొంతు ఆయనకు వంద శాతం సూట్ అవుతుంది. రాజశేఖర్ హీరోగా సక్సెస్ కావడంలో సాయి కుమార్ పాత్ర ఎంతగానో ఉందనడంలో సందేహం లేదు. అయితే ఒక దశలో సాయి కుమార్ రాజశేఖర్ సినిమాలకు డబ్బింగ్ చెప్పలేదట. ఇద్దరి మధ్య మనస్పర్థలు రేకెత్తిన నేపథ్యంలో సాయి కుమార్ డబ్బింగ్ చెప్పను అన్నారట.

అది రాజశేఖర్ సినిమాపై తీవ్ర ప్రభావం చూపిందట. నాకు డబ్బింగ్ చెప్పకుండా పరిశ్రమలో ఎలా కొనసాగుతావో చూస్తాను అంటూ రాజశేఖర్ సాయి కుమార్ కి వార్నింగ్ ఇచ్చాడట. సాయి కుమార్ మాత్రం ఇకపై రాజశేకర్ కి వాయిస్ ఇచ్చేది లేదని మొండిపట్టుతో ఉన్నారట. అప్పుడు తన తల్లి రాసిన డైరీ చూసి అభిప్రాయం మార్చుకున్నాడట. ఆ డైరీలో ఆమె తనకు రాజశేఖర్ అంటే ఎంత ఇష్టమో రాశారట. దాంతో ఇగో వదిలేసి ‘ఎవడైతే నాకేంటి’ చిత్రం నుండి మరలా రాజశేఖర్ కి సాయి కుమార్ డబ్బింగ్ చెబుతున్నారట. ప్రస్తుతం రాజశేఖర్ ఫేడ్ అవుట్ అయ్యారు. ఆయన హీరోగా సినిమాలు చేయడం లేదు.