https://oktelugu.com/

Naresh- Pavitra Lokesh: అందరి ముందే నరేష్-పవిత్ర లోకేష్ ముద్దులాట… భూమి బద్దలైనా వదిలేది లేదంటూ సీరియస్ కామెంట్స్

నరేష్ మళ్ళీ పెళ్లి అంటూ ఓ సంచలన మూవీ చేశారు. నరేష్-పవిత్ర జంటగా నటించారు. ఈ మూవీ నరేష్ జీవితంలో చోటు చేసుకున్న యధార్థ సంఘటనల సమాచారం.

Written By:
  • Shiva
  • , Updated On : May 16, 2023 / 08:14 AM IST

    Naresh- Pavitra Lokesh

    Follow us on

    Naresh- Pavitra Lokesh: నరేష్ చాలా బోల్డ్. ఈ మధ్య కాలంలో ఆయన చర్యలు చూస్తే ఇది అర్థం అవుతుంది. గతంలో నరేష్ మీద ఉన్న అభిప్రాయం వేరు. గత ఏడాది కాలంగా ఏర్పడిన అభిప్రాయం వేరు. నరేష్ పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడని 2022లో బయటపడింది. కానీ గత నాలుగేళ్లుగా వీరు కలిసే ఉంటున్నారు. కేవలం సన్నిహిత వర్గాలకు మాత్రమే ఈ విషయం తెలుసు. పవిత్ర లోకేష్ ని నరేష్ పెళ్లి చేసుకోలేదు. ఆ విషయం ఆయన స్వయంగా చెప్పాడు. కానీ భార్యకు ఏమాత్రం తక్కువ కాదు. చెప్పాలంటే అంతకంటే ఎక్కువే.

    నరేష్ మళ్ళీ పెళ్లి అంటూ ఓ సంచలన మూవీ చేశారు. నరేష్-పవిత్ర జంటగా నటించారు. ఈ మూవీ నరేష్ జీవితంలో చోటు చేసుకున్న యధార్థ సంఘటనల సమాచారం. టీజర్, ట్రైలర్ లతో నరేష్ ప్రేక్షకులకు సినిమాపై అవగాహన కలిగించారు. అయితే ఇది నా స్టోరీ కాదని ఆయన చెబుతున్నారు. కానీ అది నిజం కాదు. నరేష్ రమ్య రఘుపతిని మూడో వివాహం చేసుకున్నారు. ఆమెతో నరేష్ కి మనస్పర్థలు తలెత్తాయి. విడిపోయారు. అయితే విడాకులు కాలేదు. కోర్టులో కేసు నడుస్తుంది. విడాకులు కావాలని నరేష్ వద్దని పవిత్ర లోకేష్ పిటీషన్స్ వేశారు.

    ఇదిలా ఉంటే… మళ్ళీ పెళ్లి మూవీ మే 26న విడుదల కానుంది. తెలుగు, కన్నడలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మిగతా భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చే ఆస్కారం కలదట. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నరేష్-పవిత్ర సిక్స్త్ సెన్స్ రియాలిటీ షోకి వచ్చారు. ఈ వేదికపై ఈ సెన్సేషనల్ కపుల్ రొమాన్స్ కురిపించారు. మీరు పవిత్రను ముద్దుగా ఏమని పిలుస్తారని ఓంకార్ నరేష్ ని అడిగారు. ముద్దుగా అమ్ములు అని పిలుస్తాను. ఇంకా ముద్దొస్తే అమ్ము అని పిలుస్తాను. ఇంకా ముద్దొస్తే… వద్దులే చెప్పకూడదు అన్నారు.

    మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటని అడగ్గా… ఆకాశం మీద పడ్డా, భూమి బద్దలైనా మేము కలిసే ఉంటామని నరేష్ చెప్పారు. ఇద్దరు ఒకరినొకరు ముద్దుల్లో ముంచెత్తారు. అనంతరం కృష్ణ, విజయ నిర్మల గురించి నరేష్ మాట్లాడారు. వారిద్దరూ 24 గంటలు కలిసే ఉండేవాళ్ళు. అమ్మ మరణించాక ఆయన పక్కన చైర్ ఖాళీగా కనిపించేది. ఆయనలో అమ్మను చూసుకున్నాను. తర్వాత ఆయన కూడా మరణించారు. ఆ రెండు చైర్స్ ఖాళీగా కనిపిస్తుంటే చూసి తట్టుకోలేకపోయేవాడిని అన్నారు.