https://oktelugu.com/

Pawan Kalyan- Anjana Devi: కొడుకు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి టాప్ సీక్రెట్ లీక్ చేసిన తల్లి అంజనా దేవి !

మదర్స్ డే వేళ కుటుంబ సభ్యులు అందరూ కలిసినట్లు సమాచారం. ప్రియమైన అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ అటు పొలిటికల్ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఒప్పుకున్న చిత్రాల షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఏకంగా నాలుగు ప్రాజెక్ట్స్ పవన్ కళ్యాణ్ సెట్స్ పైకి తీసుకెళ్లారు. హరి హర వీరమల్లు నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది. వినోదయ సితం రీమేక్, ఓ జీ, ఉస్తాద్ భగత్ సింగ్ కొంత మేర షూటింగ్ జరుపుకున్నాయి. ఇటీవల విడుదలైన ఉస్తాద్ టీజర్ ఆకట్టుకుంది.

Written By:
  • Shiva
  • , Updated On : May 16, 2023 / 08:22 AM IST

    Pawan Kalyan- Anjana Devi

    Follow us on

    Pawan Kalyan- Anjana Devi: ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు. అలాగే పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయినా పేరెంట్స్ దృష్టిలో చంటోళ్ల క్రిందే లెక్క. కనిపించగానే దగ్గరకు తీసుకొని తల నిమురుతారు. తిన్నావా లేదా? అని అడుగుతారు. మెగా మదర్ అంజనాదేవికి పిల్లలంటే ప్రాణం. ఎలాంటి స్పెషల్ ఈవెంట్ ఉన్నా అందరూ కలవాలని ఆమె చెబుతారు. అంజనాదేవికి ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు సంతానం. పెద్దబ్బాయి చిరంజీవి మెగాస్టార్ కాగా చిన్న కొడుకు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా అశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు.

    ఇటీవల అంజనాదేవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కి ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండదు. ఎండల్లో, గాలుల్లో తిరుగుతూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ కి చిన్నప్పుడు ఆస్తమా ఉండేది. అందుకే అతన్ని నేను మరింత జాగ్రత్తగా చూసుకునేదాన్ని అంటూ అంజనా దేవి ఓ షాకింగ్ ఫ్యాక్ట్ రివీల్ చేశారు. ఇక ప్రజానాయకుడిగా కోట్ల మందికి సేవ చేయాలనే బాధ్యత దేవుడు అప్పగించాడు.ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారని అన్నారు .

    అలాగే మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ… చిన్నప్పటి నుండి చిరంజీవికి దానగుణం ఎక్కువ. తన చుట్టూ ఉన్న స్నేహితులకు ఉన్నంతలో సహాయం చేసేవాడు. ఇతరుల కష్టాలను తన కష్టంగా భావించేవాడు. మెగాస్టార్ కాకముందు ఎలా ఉన్నాడో, అయ్యాక కూడా అలానే ఉన్నాడు. ఎలాంటి మార్పు లేదని అంజనాదేవి చెప్పుకొచ్చారు. చిరంజీవి భార్య సురేఖ తనకు కోడలు కాదు, కూతురు అని ఆమె అన్నారు. నాకు చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే ఆసుపత్రికి తీసుకువెళుతుంది. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుందని అంజనాదేవి అన్నారు.