Heroine Hansika: బాలనటిగా కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘దేశముదురు’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ‘హన్సిక’. ఈ చిత్రం తర్వాత ఆమెకి సౌత్ లో ఏ రేంజ్ ఆఫర్లు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మొదటి సినిమాతోనే ఆమె కోట్లాది మంది హృదయాలను ఆ రేంజ్ లో సొంతం చేసుకుంది.
అయితే ఈమె తెలుగు లో కంటే కూడా ఎక్కువగా తమిళం లోనే సక్సెస్ సాధించింది. అక్కడ ఈమె బడా హీరోలతో కూడా నటించింది. కానీ టాలీవుడ్ లో మాత్రం ఒక్క అల్లు అర్జున్ మరియు జూనియర్ ఎన్టీఆర్ తో తప్ప మిగిలిన ఏ స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ దక్కలేదు. రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న ఈమె పై కోలీవుడ్ లో ఎప్పుడూ కొన్ని రూమర్స్ ప్రచారం అవుతూ ఉండేవి, వాటిల్లో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియదు కానీ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాత్రం ఎన్నో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది.
ఆమె మాట్లాడుతూ ‘ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా వచ్చిన కొత్తల్లో చాలా అవామనాలను ఎదురుకున్నాను.అప్పట్లో నేను ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలి అనుకుంటే ,ఈ మోడల్ లో నాకు బట్టలు చేయిస్తారా అని డిజైనర్స్ ని రిక్వెస్ట్ చేసేదానిని.కానీ వాళ్ళు కుదరదు అని మొహం మీదనే చెప్పేసేవాళ్ళు, అప్పుడు నాకు చాలా బాధ వేసేది.ఆరోజుల్లో నాకు డిజైనర్ బట్టలు ఇవ్వను అన్నవాళ్ళే ఇప్పుడు నాకోసం డిజైనర్లు గా పనిచేయడానికి ఎగబడుతున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇక క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమె మాట్లాడుతూ టాలీవుడ్ లో ఒక ప్రముఖ హీరో తనని చాలా ఇబ్బంది పెట్టాడని, డేట్ కి వెళ్దాం అంటూ విసిగించేవాడని , కానీ నేను అతనికి తగిన రీతిలో సమాధానం చెప్పను అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ హన్సిక చెప్పింది ఎవరి గురించి మాట్లాడుతుంది అనేది మాత్రం తెలియడం లేదు.