https://oktelugu.com/

Bichagadu 2 Collections: బిచ్చగాడు 2′ 3 రోజుల వసూళ్లు..ఆ స్టార్ హీరో క్లోసింగ్ కలెక్షన్స్ అవుట్!

అప్పట్లోనే తెలుగు మరియు తమిళం భాషలకు కలిపి పాతిక కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ గా 'బిచ్చగాడు 2 ' రీసెంట్ గానే విడుదల అయ్యింది .

Written By:
  • Vicky
  • , Updated On : May 21, 2023 / 06:28 PM IST

    Bichagadu 2 Collections

    Follow us on

    Bichagadu 2 Collections: టాలీవుడ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టించిన చిత్రం ‘బిచ్చగాడు’. 2016 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో పోటీగా వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ చిత్రం వసూళ్లను కూడా దాటేసింది.

    అప్పట్లోనే తెలుగు మరియు తమిళం భాషలకు కలిపి పాతిక కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘బిచ్చగాడు 2 ‘ రీసెంట్ గానే విడుదల అయ్యింది .భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి యావరేజి టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ వసూళ్లు మాత్రం బంపర్ హిట్ అనే రేంజ్ లో ఉన్నాయి. మొదటి రోజు నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండు రోజులకు కలిపి 7 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.

    ఇక మూడవ రోజు అయితే ఈ సినిమాకి ప్రధాన నగరాల్లో అదనపు థియేటర్స్ మరియు అదనపు షోస్ ని పెంచుతూ పోయారు. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం మూడవ రోజు ఈ చిత్రం మొదటి రోజుకంటే ఎక్కువ వసూళ్లను రాబట్టిందట. సుమారుగా రెండు కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 6 కోట్ల 50 లక్షల రూపాయలకు జరిగింది.

    ఇప్పటి వరకు 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రేపటితో పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ అవుతుందని అంటున్నారు.ఇది ఇలా ఉండగా ఈ సినిమా రీసెంట్ గా విడుదలైన అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ మరియు నాగ చైతన్య ‘కస్టడీ’ చిత్రాల క్లోసింగ్ కలెక్షన్స్ ని కూడా దాటేసింది.ఈ రెండు సినిమాల క్లోసింగ్ కలెక్షన్స్ 7 కోట్ల రూపాయిల లోపే అనే విషయం అందరికీ తెలిసిందే.