https://oktelugu.com/

Balakrishna: బోయపాటి బాలయ్య సినిమాలో విలన్ గా ఆ స్టార్ హీరో…

రాజశేఖర్ నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఆ ఉద్దేశ్యం తోనే బోయపాటి ఈ సినిమాలో రాజశేఖర్ ని ఒక పవర్ ఫుల్ విలన్ గా చూపించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : March 3, 2024 / 06:35 PM IST

    Balakrishna

    Follow us on

    Balakrishna: సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు మంచి గుర్తింపు ఉంటుంది. ఇక వాళ్ల కాంబో లో ఎప్పుడు సినిమాలు వచ్చిన ప్రేక్షకులను నిరాశపరచవు అనే ఒక గట్టి నమ్మకంతో అభిమానులు ఉంటారు. ఇక బెస్ట్ కాంబినేషన్ అనేది ఇండస్ట్రీలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. అందువల్లే దర్శకుడు గాని, హీరోలు గాని ఎక్కువగా ఈ కాంబినేషన్ల ను రిపీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.

    ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ కాంబినేషన్ల లో బోయపాటి, బాలయ్య కాంబినేషన్ గురించి చెప్పుకోవాలి. ఈ కాంబినేషన్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు వస్తే మూడు కూడా ఒకదానిని మించి ఒకటి భారీ సక్సెస్ ని అందుకోవడంతో పాటుగా ఈ సినిమాలు వీళ్ళిద్దరికీ స్టార్ స్టేటస్ ని అందించి పెట్టాయనే చెప్పాలి. ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ సూపర్ సక్సెస్ అయింది. ఇక నాలుగోసారి కూడా వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా రాబోతుంది అనే న్యూస్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. అయితే ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని కూడా బోయపాటి పూర్తి చేసే పనిలో ఉన్నాడట…

    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా ఒక పవర్ ఫుల్ స్టార్ హీరోని పరిచయం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి బోయపాటి ఫేడౌట్ హీరోలని విలన్లుగా తీసుకొచ్చి వాళ్ళకి స్టార్ డమ్ ని అందిస్తూ ఉంటాడు. లెంజండ్ సినిమాతో జగపతి బాబును ఓవర్ నైట్ లో స్టార్ విలన్ గా మార్చేస్తే, అఖండ సినిమాలో శ్రీకాంత్ ని కూడా విలన్ పాత్రలో చూపించాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజశేఖర్ ని బాలయ్య బాబు నెక్స్ట్ సినిమా కోసం విలన్ గా రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఇప్పటికే రాజశేఖర్ నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఆ ఉద్దేశ్యం తోనే బోయపాటి ఈ సినిమాలో రాజశేఖర్ ని ఒక పవర్ ఫుల్ విలన్ గా చూపించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది…