https://oktelugu.com/

Senior NTR On Chiranjeevi: సీనియర్ ఎన్టీయార్ చిరంజీవి కి చెప్పిన మాట ఏంటంటే..?

ఎన్టీఆర్ చిరంజీవికి ఒక అద్భుతమైన మాట చెప్పాడట. ఇక ఇప్పటికీ ఆ మాట ను చిరంజీవి గుర్తుంచుకొని ఎన్టీఆర్ గారి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఈ విషయాన్ని తలుచుకుంటారట.

Written By:
  • Gopi
  • , Updated On : March 3, 2024 / 06:32 PM IST

    Senior NTR On Chiranjeevi

    Follow us on

    Senior NTR On Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే మొదట చిరంజీవి సీనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఒక సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు. ఈ సినిమాలో చిరంజీవి నటనని చూసిన ఎన్టీఆర్ చాలా అద్భుతంగా నటిస్తున్నారు బ్రదర్ అంటూ చిరంజీవిని పొగిడేవాడట, ఇక ఆ సినిమాలో ఒక ఫైట్ సీన్ లో ఇద్దరు కలిసి నటించాల్సి ఉండగా, ఇద్దరు కలిసి ఒక గ్లాస్ మీద దూకే షాట్ ని చిత్రీకరిస్తున్న సమయంలో చిరంజీవి డైరెక్టర్ చెప్పిన వెంటనే ఓకే అని డైరెక్ట్ గా గాల్లో రౌండ్స్ తిరిగి ఒక గ్లాస్ మీద దూకాడట.

    ఇక దాంతో ఎన్టీఆర్ చిరంజీవి దగ్గరికి వెళ్ళి బ్రదర్ మనకి డూప్ లు ఉంటారు కదా మనం దూకినట్టుగా చిన్న రియాక్షన్ ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. హీరో అనేవాడు చాలా కీలకమైన వ్యక్తి ఒకవేళ మనకు ఏదైనా ఇంజ్యూరి జరిగి కొద్ది రోజులు కనక మనం రెస్ట్ తీసుకోవాల్సి వస్తే సినిమా షూటింగ్ మొత్తం ఆగిపోవాల్సి వస్తుంది. దాని వల్ల ప్రొడ్యూసర్ కి విపరీతమైన నష్టం తో పాటు సినిమా కోసం కష్టపడే కార్మికులకి కూడా పని లేకుండా పోతుంది. అందుకే ఆర్టిస్ట్ ల హెల్త్ చాలా ఇంపార్టెంట్ బ్రదర్.. రిస్కీ షాట్స్ ఏమైనా ఉంటే డూప్ లతో చేయాలి.

    ఇంకెప్పుడు ఇలాంటి రిస్క్ చేయకండి అంటూ ఎన్టీఆర్ చిరంజీవికి ఒక అద్భుతమైన మాట చెప్పాడట. ఇక ఇప్పటికీ ఆ మాట ను చిరంజీవి గుర్తుంచుకొని ఎన్టీఆర్ గారి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఈ విషయాన్ని తలుచుకుంటారట. అలాగే ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులకి కూడా చిరంజీవి ఈ విషయాన్ని చెబుతూ డూప్ లను వాడుకోవాలని సలహాలిస్తూ ఉంటాడట.

    నిజానికైతే ఆర్టిస్టులు చాలా కీలకమైన వ్యక్తులనే చెప్పాలి. వాళ్లు కనక ఒక రెండు మూడు నెలలు సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇస్తే మాత్రం అందరూ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందువల్లే తప్పనిసరిగా వీళ్ళు డూపులను వాడుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది…