https://oktelugu.com/

Prabhas: ప్రభాస్ ని నమ్మించి దారుణంగా మోసం చేసిన ఆ స్టార్ డైరెక్టర్…కోపానికి వచ్చిన ప్రభాస్…

డైరెక్టర్ వేరే హీరోతో సినిమా చేస్తున్నాడు అని తెలిసి ఆ డైరెక్టర్ తో లైఫ్ లో ఇంకోసారి నీతో సినిమా చేయను అని తన మొకం మీదనే చెప్పినట్టు గా అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి.

Written By: , Updated On : December 20, 2023 / 08:27 AM IST
Prabhas

Prabhas

Follow us on

Prabhas: ఈశ్వర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ మొదటి సినిమాతోనే హీరోగా తనదైన మార్క్ నటనని కనబరిచాడు. ఇక ఆ తర్వాత తీసిన రాఘవేంద్ర సినిమా పెద్దగా ఆడినప్పటికీ మూడో సినిమాగా వచ్చిన వర్షం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకోవడంతో పాటుగా తను ఒక స్టార్ హీరోగా కూడా మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ వర్షం సినిమా తర్వాత ఆయనతో ఒక సినిమా చేస్తానని ఒక స్టార్ డైరెక్టర్ అతనికి మాట ఇచ్చి అతని డేట్స్ ని కూడా చాలా రోజులపాటు లాక్ చేసినట్టుగా తెలుస్తుంది.

ఇక ఆ తర్వాత ఆ డైరెక్టర్ ఎంతకీ స్పందించకపోవడంతో ప్రభాస్ ఆ డైరెక్టర్ అసిస్టెంట్ ని పిలిచి ఏం జరుగుతుందో అని అడిగితే ఆల్రెడీ ఆ డైరెక్టర్ వేరే హీరోతో మరొక సినిమా స్టార్ట్ చేసుకుని సైలెంట్ గా షూటింగ్ కూడా చేసేసుకుంటున్నాడు అని చెప్పడంతో ప్రభాస్ ఆ డైరెక్టర్ మీద కొద్దిగా సీరియస్ అయి నెక్స్ట్ తను మరొక సినిమా కమిట్ అయి సినిమా షూటింగ్ కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దాదాపు 50 రోజులపాటు ప్రభాస్ డేట్స్ ని వేస్ట్ చేస్తు అన్ని రోజులు వేరే సినిమాకి కమిట్ అవ్వకుండా ఖాళీ గానే కూర్చొని ఉన్నాడు.

ఇక డైరెక్టర్ వేరే హీరోతో సినిమా చేస్తున్నాడు అని తెలిసి ఆ డైరెక్టర్ తో లైఫ్ లో ఇంకోసారి నీతో సినిమా చేయను అని తన మొకం మీదనే చెప్పినట్టు గా అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి.అయితే ప్రభాస్ కి అంత కోపం రావడానికి కారణం ప్రభాస్ డేట్స్ 50 రోజుల నుంచి వేస్ట్ చేయడం ఒక కారణం అయితే ఆయనతో సినిమా చేస్తాను అని చెప్పి మళ్లీ వేరే హీరోతో సినిమా చేయడం కరెక్ట్ కాదు.

ఒకవేళ వేరే హీరో తో సినిమా చేసిన కూడా ఆ విషయం ప్రభాస్ కి చెబితే బాగుండేది కానీ తను చెప్పకుండా తన డేట్స్ ని వేస్ట్ చేస్తూ వేరే హీరోతో సైలెంట్ గా సినిమా చేసుకోవడం తో కోపానికి వచ్చిన ప్రభాస్ ఆయనతో లైఫ్ లో సినిమా చేయను అని చెప్పి అప్పటికప్పుడు బి గోపాల్ డైరెక్షన్ లో అడవి రాముడు సినిమాకు సైన్ చేసినట్టుగా తెలుస్తుంది…అలా ఒక స్టార్ డైరెక్టర్ ప్రభాస్ ని నమ్మించి మోసం చేశాడు అందుకే ఇప్పటికి కూడా ఆ స్టార్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా చేయడం లేదు…