https://oktelugu.com/

Rajamouli: రాజమౌళి మొదటి సినిమా ఆ స్టార్ హీరో తో చేయాల్సింది… మధ్యలో ఎన్టీయార్ ఎలా వచ్చాడంటే..?

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న నటులు స్టార్ హీరోలుగా రాణిస్తూ ముందుకు దూసుకెళ్తుంటారు. ఇక అదే క్రమంలో దర్శకులతో హీరోలకు చాలా మంచి బాండింగ్ అయితే ఉంటుంది. దాని వల్లే కొంతమంది దర్శకులు వాళ్ళ దగ్గర ఉన్న మంచి కథలను ఆయా హీరోలతో చేసి మంచి విజయాలను అందుకోవాలని చూస్తుంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 21, 2024 / 08:52 AM IST

    Rajamouli(1)

    Follow us on

    Rajamouli: పాన్ ఇండియా రేంజ్ దాటి వరల్డ్ సినిమా స్థాయికి వెళ్తున్న దర్శకుడు రాజమౌళి… ఈయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఆయనను గొప్ప దర్శకుడిగా ఉన్నత స్థానంలో నిలబెట్టాయనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ఈయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యం ఉండడమే కాకుండా ఆయా హీరోలను చాలా కొత్తగా ప్రజెంట్ చేయడంలో ఆయన ఎప్పుడూ సక్సెస్ అవుతూ వచ్చాడు. అందుకే రాజమౌళి అంటే ప్రతి ఒక్క హీరో కి చాలా గౌరవం ఉంటుంది. ఆయనతో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి హీరో కూడా ఎదురుచూస్తున్నాడు అంటే ఆయన స్టార్ డమ్ ఎంతలా విస్తరించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్న రాజమౌళి చాలా తొందర్లో ఈ సినిమాతో మరోసారి వరల్డ్ లో తన సత్తా చాటడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా రాజమౌళికి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది. అయితే మొదటగా రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాని ప్రభాస్ తో చేయాలని అనుకున్నాడట. కానీ అనుకోని కారణాల వల్ల ప్రొడ్యూసర్ అశ్వినిదత్ అలాగే రాఘవేంద్రరావు ఇద్దరు కలిసి జూనియర్ ఎన్టీఆర్ తో ఈ సినిమా చేయమని అతన్ని పరిచయం చేశారట. దానికి రాజమౌళి మాత్రం ఎన్టీఆర్ ను చూసి చాలా వరకు డిస్సాపాయింట్ అయ్యాడట. ఎందుకంటే ఎన్టీఆర్ అప్పట్లో చాలా బొద్దుగా ఉండేవాడు.

    దాంతో నా మొదటి సినిమాకి ఇలాంటి హీరోని ఇస్తున్నారు ఏంట్రా బాబు అని రాజమౌళి చాలా బాధపడ్డాడట. కానీ ఒక్కసారి జూనియర్ ఎన్టీఆర్ కెమెరా ముందుకొచ్చి యాక్టింగ్ చేసిన తర్వాత రాజమౌళి తన డిసిజన్ రాంగ్ అని అనుకున్నాడట. అంత మంచి పర్ఫామెన్స్ ఇవ్వడంతో బ్యాక్ టు బ్యాక్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి లాంటి సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు.

    ఇక అప్పటినుంచి జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి వాళ్ల బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండటమే కాకుండా రోజురోజుకి వాళ్ళ మధ్య ప్రేమానుబంధాలనేవి పెరుగుతూ పోతున్నాయనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు రాజమౌళి ఎవరితో చేయని విధంగా ఎన్టీయార్ తో నాలుగు సినిమాలు చేశాడు. ఇక ఎన్టీఆర్ కి ఒక మంచి బ్రేక్ ఇవ్వడమే కాకుండా వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎలాంటిదో కూడా ప్రూవ్ చేసుకున్నారు…