Ram Charan: మెగాస్టార్ తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనకంటూ ఒక క్రేజ్ ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతుండటం నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఆయన గేమ్ చేంజర్ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆయన కనక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకుంటే ఇండియాలో టాప్ హీరోగా ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈ సినిమా తర్వాత ఆయన బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక దాని తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు… ఇక సుకుమార్ రామ్ చరణ్ తో రంగస్థలం సినిమా చేస్తున్న సమయంలోనే ఈ కాంబోలో మరొక సినిమా చేయాలని ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడట. నిజానికి రామ్ చరణ్ లాంటి నటుడితో తక్కువ సమయంలో రెండు సినిమాలు చేయడం అనేది మామూలు విషయం కాదు. కానీ సుకుమార్ ముందే ఏర్పాటు చేసుకున్న ఒప్పందంతో రామ్ చరణ్ కూడా అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఇద్దరు కూడా పాన్ ఇండియాలో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు.
కాబట్టి మార్కెట్ పరంగా కూడా ఇద్దరికి బాగా వర్కౌట్ అవుతుంది. అందుకే ఈ సినిమాని దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వల్లే నిర్మిస్తున్నారా?
లేదంటే వేరే ప్రొడక్షన్ హౌస్ లో ఈ సినిమాని చేయబోతున్నారా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే మాత్రం రామ్ చరణ్ భారీ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది.
ఇక సుకుమార్ పుష్ప 2 సినిమాతో భారీ ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి రామ్ చరణ్ చేయబోయే సినిమాకి సుకుమార్ స్టార్ ఇమేజ్ కూడా భారీగా ప్లస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి…చూడాలి మరి వీళ్ళ కాంబో లో ఎలాంటి సినిమా రాబోతుంది అనేది…