https://oktelugu.com/

Amaran: ‘అమరన్’ చిత్రాన్ని తెలుగులో మిస్ చేసుకున్న స్టార్ హీరో అతనేనా..? చేసుంటే ఇండస్ట్రీ షేక్ అయ్యేది!

తెలుగు లో కూడా 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్, కర్ణాటక, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఇలా అన్ని ప్రాంతాలకు కేవలం ఇండియాలో 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని, ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కలుపుకొని 65 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 31, 2024 / 04:17 PM IST

    Amaran

    Follow us on

    Amaran: తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన ‘అమరన్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం భాషల్లో గ్రాండ్ గా విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. కమల్ హాసన్ నిర్మాతగా ‘రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి అటు తమిళంలో, ఇటు తెలుగులో కళ్ళు చెదిరిపోయే రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఈ ఏడాది విడుదలైన ‘దేవర’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’, ‘వెట్టియాన్’ వంటి భారీ చిత్రాల అడ్వాన్స్ బుకింగ్స్ తో సమానంగా గంటకి 30 వేలకు పైగా టికెట్స్ సేల్స్ ట్రెండింగ్ తో ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపోయేలా చేసింది ఈ చిత్రం. ఒక్క తమిళనాడు నుండే ఈ చిత్రానికి 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట.

    అదే విధంగా తెలుగు లో కూడా 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్, కర్ణాటక, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఇలా అన్ని ప్రాంతాలకు కేవలం ఇండియాలో 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని, ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కలుపుకొని 65 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వెట్టియాన్’ చిత్రానికి మొదటి రోజు 69 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన సంగతి తెలిసిందే. టీవీ యాంకర్ గా, కమెడియన్ గా కెరీర్ ని ప్రారంభించిన ఆయన, ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ని దాటే రేంజ్ కి ఎదిగాడంటే, ఆయన టాలెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి ఇటీవలే తమిళంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే అమరన్ చిత్రాన్ని ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయాలనీ ఆ చిత్ర దర్శకుడు అనుకున్నాడట. పుష్ప కి ముందే ఈ సినిమా కథని ఆయనకీ చెప్పాలని అనుకున్నాడు. కానీ అల్లు అర్జున్ అపాయిట్మెంట్ దొరకడం అప్పట్లో కష్టమైందట, అతన్ని ఎలా కలవాలి అనే విషయం కూడా తెలియదట. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రం విడుదల అవ్వడం, ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ హిట్ అవ్వడం, పుష్ప 2 తో బిజీ అవ్వడం, ఆ తర్వాత కూడా వరుసగా పాన్ ఇండియన్ సినిమాలను ఎంచుకోవడంతో ఇప్పట్లో అల్లు అర్జున్ తో చేయడం కష్టమే అని భావించి శివ కార్తికేయన్ తో చేసాడు. ఒకవేళ ఈ చిత్రం అల్లు అర్జున్ చేసుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేదని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.