Prabhas: యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్…ఈ సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ ఇండస్ట్రీలో కూడా వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ లాంటి నటుడు చేయబోయే ప్రతి సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన చాలా తక్కువ సమయంలోనే పాన్ ఇండియా సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇంతకుముందు కొన్ని ఇంటర్వ్యూల్లో ప్రభాస్ తన అభిమాన దర్శకుడు ఎవరు అంటే ఆయన రాజ్ కుమార్ హీరాని పేరు చెప్పాడు. మొత్తానికైతే ఆయన డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని ఉందని కూడా చెప్పడం విశేషం… అయితే రాజ్ కుమార్ హిరానీ షారుక్ ఖాన్ ను హీరోగా పెట్టి చేసిన డంకి సినిమా ప్లాప్ అయింది. దాంతో ఆయన మార్కెట్ భారీగా డౌన్ అయింది. అప్పటివరకు అపజయం ఎరుగని ఆ దర్శకుడు ఒక్కసారిగా డిజాస్టర్ ని మూటగట్టుకోవడం అనేది చాలా వరకు చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమా విషయంలో ఎలాంటి స్ట్రాటజీని అనుసరిస్తున్నారు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…
ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ఆయన ప్రభాస్ కి ఒక కథ వినిపించారట. అయితే ఆ కథ చాలా సాఫ్ట్ గా ఉండడంతో ప్రభాస్ తన ఇమేజ్ కు తగ్గట్టుగా లేదనే ఉద్దేశ్యంతో ఆ కథను రిజెక్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఏదైనా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉంటే తీసుకురమ్మని ప్రభాస్ చెప్పారట. రాజ్ కుమార్ హిరానీ కూడా ఓకే అన్నట్టుగా సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది.
మరి మొత్తానికైతే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఆ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని కొంతమంది సినీ మేధావులు అభిప్రాయపడుతున్నారు. కానీ మరి కొంతమంది మాత్రం రాజ్ కుమార్ హిరానీ కంటెంట్ బేస్డ్ సినిమాలను చేస్తూ ఉంటారు. ప్రభాస్ అంటే భారీ ఆక్షన్ ఎంటర్టైనర్ లకు పెట్టింది పేరుగా మారారు.
మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వర్కౌట్ అవ్వాలంటే అది పూర్తి కమర్షియల్ గా ఉండాలి. అంతే తప్ప కాన్సెప్ట్ బేస్డ్ గా ఉంటే ఆ సినిమాకి పెద్దగా ఆదరణ దక్కకపోవచ్చని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేయడం విశేషం…