https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్ 8’ లోకి కంటెస్టెంట్ గా టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్..ట్విస్టుల మీద ట్విస్టులు..ఆడియన్స్ కి పండగే!

రాజేష్ మహాసేన ఈయన యూట్యూబ్ లో రాజకీయ విశ్లేషకుడిగా చాలా కాలం నుండి ఒక ఛానల్ ని నడుపుతున్న సంగతి తెలిసిందే. ముందుగా వైసీపీ పార్టీ కి సపోర్టుగా టీడీపీ, జనసేన పార్టీ నేతలను తిడుతూ వీడియోలు చేసేవాడు, ఆ తర్వాత వైసీపీ పార్టీ కి వ్యతిరేకంగా మారి పవన్ కళ్యాణ్ ని, జనసేన పార్టీ ని పొగుడుతూ ఎన్నో వీడియోలు చేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : August 14, 2024 / 12:45 PM IST

    Bigg Boss 8 Telugu

    Follow us on

    Bigg Boss 8 Telugu: మరో మూడు వారాల్లో స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించి రోజుకి ఒక షాకింగ్ ట్విస్ట్ తో ఆసక్తికరమైన విషయాలు బయటకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన కాన్సెప్ట్, పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియా లో పలు కథనాలు మీరు చూసే ఉంటారు. కంటెస్టెంట్స్ తో కూడా రీసెంట్ గానే బిగ్ బాస్ యాజమాన్యం అగ్రిమెంట్ చేయించుకుంది. రేపు ఈ సీజన్ ప్రారంభం అయ్యే తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారట టీం. ఇకపోతే ఈ సీజన్ లో ఎవ్వరూ ఊహించని రాజకీయ నాయకుడిని రీసెంట్ గానే బిగ్ బాస్ టీం ఇంటర్వ్యూ చేశారట. ఆ రాజకీయ పార్టీ కి సంబంధించిన ఆ నాయకుడు ఈ షో లో కంటెస్టెంట్ గా పాల్గొనేందుకు అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేసాడట.

    అతను మరెవరో కాదు, రాజేష్ మహాసేన. ఈయన యూట్యూబ్ లో రాజకీయ విశ్లేషకుడిగా చాలా కాలం నుండి ఒక ఛానల్ ని నడుపుతున్న సంగతి తెలిసిందే. ముందుగా వైసీపీ పార్టీ కి సపోర్టుగా టీడీపీ, జనసేన పార్టీ నేతలను తిడుతూ వీడియోలు చేసేవాడు, ఆ తర్వాత వైసీపీ పార్టీ కి వ్యతిరేకంగా మారి పవన్ కళ్యాణ్ ని, జనసేన పార్టీ ని పొగుడుతూ ఎన్నో వీడియోలు చేసాడు. జనసేన పార్టీ లోకి అడుగుపెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసాడు, కానీ పవన్ కళ్యాణ్ ఆయనని స్వాగతించలేదు. కొన్నాళ్ళకు ఆయన టీడీపీ పార్టీ లో చేరి, పీ గన్నవరం స్థానం నుండి పోటీ చేసేందుకు ఎమ్మెల్యే టికెట్ కూడా సంపాదించాడు. కానీ స్థానికులు ఇతన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో పోటీ నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఆ స్థానం నుండి జనసేన పార్టీ పోటీ చేసి భారీ మెజారిటీ తో గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి నేడు బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతున్నాడు అనే టాక్ రావడం నిజంగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

    ఒక పార్టీ కి స్టాండ్ తీసుకొని, వార్తల్లో సంచలనం గా నిల్చిన వ్యక్తికి బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం ఎలా ఇస్తారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు. కానీ ఈ షో ద్వారా ఆయన జనాలకు మరింత చేరువై ఫాలోయింగ్ ని పెంచుకునేందుకే ఇలా చేస్తున్నాడని తెలుస్తుంది. అంతే కాదు రాజేష్ మహాసేన కి సోషల్ మీడియా లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఒక వర్గాన్ని ప్రభావితం చేసేలా ఆయన వీడియోస్ ఉంటాయి. కాబట్టి బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే అసలు ఏమి ఆడకపోయినా కూడా 10 వారాలు కొనసాగేంత ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి, బాగా ఆడితే టైటిల్ కూడా గెలవొచ్చు. చూడాలి మరి రాజేష్ మహాసేన ఎలా ఆడబోతున్నాడు అనేది.