https://oktelugu.com/

Karthika Deepam: మోనిత ఫోటో ఫ్రేమ్ ను పగలకొట్టిన సౌందర్య.. రుద్రాణి మాటలకు ఒప్పందం తీసుకున్న కార్తీక్!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈరోజు ఏం జరిగిందంటే.. కార్తీక్, దీపకు శ్రీవల్లి బాబుని చూడగానే అనుమానం రావడంతో కోటేష్ బాబును దత్తత తీసుకున్నామని చెబుతాడు. అబ్బులు కోటేశ్ వాళ్ళను చూసి వాళ్ళు ఆ ఇంట్లో ఉంటున్నారు అని రుద్రాణికి చెబుతాడు. పిల్లలు బాబుతో సంతోషం గా ఆడుకుంటారు. కోటేష్ రుద్రాణి ఏం చేస్తుందో అని భయపడుతాడు. ఇక కార్తీక్, దీప ఏం జరగదు అని ధైర్యం ఇస్తారు. మోనిత సౌందర్య […]

Written By: , Updated On : December 18, 2021 / 09:49 AM IST
Follow us on

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈరోజు ఏం జరిగిందంటే.. కార్తీక్, దీపకు శ్రీవల్లి బాబుని చూడగానే అనుమానం రావడంతో కోటేష్ బాబును దత్తత తీసుకున్నామని చెబుతాడు. అబ్బులు కోటేశ్ వాళ్ళను చూసి వాళ్ళు ఆ ఇంట్లో ఉంటున్నారు అని రుద్రాణికి చెబుతాడు. పిల్లలు బాబుతో సంతోషం గా ఆడుకుంటారు. కోటేష్ రుద్రాణి ఏం చేస్తుందో అని భయపడుతాడు. ఇక కార్తీక్, దీప ఏం జరగదు అని ధైర్యం ఇస్తారు.

Karthika Deepam

Karthika Deepam

మోనిత సౌందర్య వాళ్ళ ఇంట్లో తన ఫోటోని చూసుకుంటూ మురిసిపోతూ సెల్ఫీలు దిగుతుంది. అప్పుడే ప్రియమణి రావటంతో ఆ ఇంట్లో తన హోదా గురించి చెప్పుకుంటూ సంతోషపడుతుంది. అప్పుడే సౌందర్య వచ్చి ఆ ఫోటోను పగలగొట్టి మోనితపై బాగా ఫైర్ అవుతుంది. ఇలాంటి పనులు మరోసారి చేస్తే నిన్ను చంపేసి నీ ఫ్లెక్సీ కడతాను అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. దాంతో మోనిత కోపం తో రగిలిపోతుంది.

Also Read: ఫోటో ఫ్రేమ్ తో సౌందర్య వాళ్లకు షాక్ ఇచ్చిన మోనిత.. సౌందర్యపై మండిపడ్డ ఆదిత్య!

మరోవైపు అబ్బులు కార్తీక్ వాళ్ళ దగ్గరికి వచ్చి రుద్రాణి అక్క కార్తీక్ ను పిలుస్తుంది అని అనటంతో దీప, కోటేష్ భయపడతారు. కార్తీక్ తాను వెళ్లకపోతే తను ఇక్కడికి వచ్చి గొడవ చేస్తుందేమో అని భయపడి అక్కడికే వెళ్తాడు. దీప ఏం జరుగుతుందో అని బాగా టెన్షన్ పడుతుంది. ఆ రుద్రాణి ఏమంటుందో అని ఒకటే ఆలోచిస్తుంది. పిల్లలు ఇద్దరూ బాబు తో సరదాగా ఆడుకుంటూ ఉంటారు.

కార్తీక్ రుద్రాణి దగ్గరికి వెళ్లడంతో రుద్రాణి తన క్రూరత్వం గురించి మొత్తం చెబుతుంది. తాను చేసిన మోసాల గురించి చెబుతుంది. ఇక ఎవరైనా ఏదైనా మోసం చేస్తే తమ దగ్గరున్న వాటిలో ఒకటి తీసుకుంటాను అని ఒప్పందం తీసుకుంటానని చెబుతుంది. ఇక కార్తీక్ కు వార్నింగ్ ఇవ్వడంతో కోటేష్ అప్పు కూడా కడతానని ముందుకు వస్తాడు. తరువాయి భాగంలో పిల్లలిద్దర్నీ చూసి కార్తీక్ బాధపడుతూ ఉంటాడు. అంత లోనే దీప కార్తీక్ ని చూస్తుంది.

Also Read: సమంత అందుకే అంత ప్రత్యేకం… సక్సెస్ సీక్రెట్ అదే!