https://oktelugu.com/

Omicron in India: దేశాన్ని ఒమిక్రాన్ వైరస్ కమ్మేస్తోందా? 3వ వేవ్ తప్పదా?

Omicron in India: దేశంలో చాపకింద నీరులా ఒమిక్రాన్ విస్తరిస్తోంది. గతంలోలాగే ఈ వైరస్ సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మొదట్లో కర్ణాటకలో ప్రారంభమైన ఒమిక్రాన్ తాజాగా 11 రాష్ట్రాలకు విస్తరించింది. మొత్తం శుక్రవారం వరకు 101 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా… ఆ తరువాత ఢిల్లీలో 22 కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కేసులు ఇలాగే పెరిగితే చికిత్స […]

Written By:
  • NARESH
  • , Updated On : December 18, 2021 / 09:52 AM IST

    Omicron variant

    Follow us on

    Omicron in India: దేశంలో చాపకింద నీరులా ఒమిక్రాన్ విస్తరిస్తోంది. గతంలోలాగే ఈ వైరస్ సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మొదట్లో కర్ణాటకలో ప్రారంభమైన ఒమిక్రాన్ తాజాగా 11 రాష్ట్రాలకు విస్తరించింది. మొత్తం శుక్రవారం వరకు 101 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా… ఆ తరువాత ఢిల్లీలో 22 కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కేసులు ఇలాగే పెరిగితే చికిత్స అందించేందుకు వైద్య సౌకర్యాలను అందుబాటులో ఉంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఒమిక్రాన్ తో ప్రమాదమేమి లేదని చెబుతున్నా.. అత్యధిక వేగంతో కేసులు పెరగడం ఆందోళన వ్యక్తమవుతోంది.

    Omicron Variant

    2020 జనవరి చివరి వారంలో దేశంలో కరోనా మొదటి వేరియంట్ కేసులు మొదలయ్యాయి. ఆ తరువాత నెల తరువాత వీటి పెరుగుదల లేకున్నా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా లాక్డౌన్ విధించారు. ఆ తరువాత జూన్లో సడలింపులు ఇచ్చినా కేసులు అత్యధికంగా పెరిగాయి. అయితే మరోసారి ఈ ఏడాది ఫిబ్రవరి డేల్టా వేరియంట్ విస్తరణ మొదలైంది. మొదట్లో దీంతో పెద్దగా ప్రమాదం లేదని అనుకున్నారు. కానీ ఆ తరువాత నెలరోజుల్లోనే లక్షల్లో కేసులు నమోదయ్యాయి. అందుకు తోడు మరణాలు కూడా అధికంగానే జరిగాయి. రెండో వేరియంట్ ను ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది.

    అయితే ఆ తరువాత ఆగస్టు సెప్టెంబర్ నుంచి కేసుల తగ్గుదల ప్రారంభమైంది. అక్టోబర్ వరకు కరోనా కేసుల పెరుగుదల క్షీణించింది. ఇక దాదాపు కరోనా భయం పూర్తిగా తొలిగిపోయినట్లేనని భావించిన తరుణంలో దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్(Omicron in India) వైరస్ వెలుగులోకి వచ్చింది. గత నెల 25న గుర్తించిన ఈ వైరస్ ఇప్పటికే పలు దేశాలకు విస్తరించింది. అయితే ఆ దేశాల నుంచి భారత్ కు వచ్చేవారిలో దీనిని గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారిలోనే ఒమిక్రాన్ ను గుర్తించారు. ర్యాండమ్ టెస్టులు చేస్తే కేసులు మరిన్ని బయటపడే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

    Also Read: ఒమిక్రాన్ తో థర్డ్ వేవ్ కు ఛాన్స్.. కేంద్రం కీలక సూచనలు..!

    ఇప్పటికే కరోనా నివారన వ్యాక్సిన్ పై ప్రభుత్వం దృష్టి సారించింది. నిర్బంధ టీకాలు వేస్తూ వంద శాతం పూర్తయ్యేందుకు కృషి చేస్తోంది. అయితే రెండు డోసులు వేసుకున్నా కొందరిలో ఒమిక్రాన్ గుర్తించడం కలకలం రేపుతోంది. కానీ వైద్య నిపుణులు మాత్రం ఒమిక్రాన్ ను రెండు డోసుల టీకా అడ్డుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో బూస్టర్ డోస్ కోసం కూడా ప్రభుత్ం ప్రయత్నాలు ప్రారంభించింది. అయతే ఇప్పటికీ మొదటి డోసు వేసుకోని వారు చాలా మందే ఉన్నారు. మొదటి డోసు వంద శాతం పూర్తయిన తరువాత బూస్టర్ డోస్ గురించి ఆలోచించే అవకాశం ఉందని అంటున్నారు.

    ఈ ఏడాది జూన్ -జూలైలో డెల్టా వేవ్ వచ్చినప్పుడు కేసుల్లో పెరుగుదల కనిపించలేదు. దీంతో అప్పుడు వైద్యాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఒమిక్రాన్ రెట్టింపు వేగంతో విస్తరిస్తోంది. మరోవైపు యూకేలో ఓ మరణం కూడా సంభవించడంతో ఆ తరువాత ఏం జరుగుతుందనే పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ ను గుర్తించగానే జినోమ్ సీక్వెన్స్ కు కూడా వేగంగా ప్రకటించడంతో దీనిని అడ్డుకోవడం సైంటిస్టులకు సులభంగా మారింది. అయితే ఇప్పుడున్న వేరింట్ లోమార్పు వస్తే మాత్రం సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే కొంతమంది ప్రొఫెసర్లు మాత్రం మనుషుల్లోని వ్యాధినిరోధక శక్తిని భట్టే వైరస్ ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఇందులకు టీకాలు వేసుకోవడమే మార్గమని అంటున్నారు. వ్యాధినిరోధక శక్తి బాగుంటే వైరస్ ను పోరాడడం కష్టమేం కాదని అంటున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు రెండో డోసుల వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

    Also Read: ‘ఒమిక్రాన్’ భయం: దేశంలో మళ్లీ లాక్ డౌన్ వస్తుందా?