Star Comedian
Star Comedian: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ల కొడుకులు చాలా మంది స్టార్లుగా ఎదుగుతుంటారు. కానీ ఒక కమెడియన్ కుమారుడు మాత్రం.. ఐఏఎస్ ఆఫీసర్ గా ఎంపికయ్యాడు. అతని పేరే శ్రుతంజయ నారాయణన్. ఈయన తండ్రి సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కమెడియన్ చిన్ని జయంత్. ఈయన అసలు పేరు కృష్ణమూర్తి నారాయణన్. తమిళ స్టార్ రజినీకాంత్ తో కలిసి 80 సినిమాల్లో నటించారు. అయితే శ్రుతంజయ చెన్నైలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి నాటకాలు వేసేవాడు.
చదువులోనూ రాణించారు. గిండీలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ కార్టోగ్రఫీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. అశోక యూనివర్సిటీ నుంచి లిబరల్ ఆర్స్ట్ అండ్ సైన్సెస్/లిబరల్ మాస్టర్స్ డిగ్రీ చదివాడు. చదువు పూర్తయ్యాక ఓ స్టార్టప్ కంపెనీలో చేరాడు. ఆ సమయంలోనే నటనకు స్వస్తి చెప్పి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అయ్యారు. ఫుల్ టైమ్ జాబ్ చేస్తూనే ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు గంటలు చదివేవాడు. రాత్రి షిప్ట్ లో ఉద్యోగం చేసేవాడట.
క్రమంగా ప్రిపరేషన్ సమయం పొడిగించి.. కోచింగ్ కు వెళ్లకుండానే రోజుకు 10 నుంచి 12 గంటల పాటు చదివేవాడట. మొదటి ప్రయత్నంలో విఫలమైనా పట్టు విడువలేదు. తప్పులను సరిదిద్దుకుంటూ పూర్తిస్థాయిలో సన్నద్దమయ్యాడు. రెండో ప్రయత్నంలో సివిల్స్ లో సక్సెస్ అయ్యాడు. 2015 యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో ఆల్ ఇండియా 75 ర్యాంక్ సాధించి ఐఏఎస్ కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం తమిళనాడులోని త్రిప్పూర్ జిల్లాలో సబ్ కలెక్టర్ గా విధులు నిర్విహిస్తున్నాడు శ్రుతంజయ్.
అయితే ప్రముఖ నటుల పిల్లలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలోనే కెరీర్ ను ప్రారంభిస్తుంటే.. ఈయన మాత్రం అందరికీ భిన్నంగా ట్రైనింగ్ తీసుకొని ఐఏఎస్ గా ఎదిగి చూపించారు. ఇలా ఆయన ఎంతో మంది స్టార్లకు, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మీరు కూడా ఇలాగే సంకల్పంతో కష్టపడితే ఏదైనా సాధ్యమే అని ఒప్పుకుంటారా?