Heartbeat Series : డిస్నీ+హాట్‌స్టార్ లో అత్యంత భారీ రివ్యూలతో సాగుతున్న సిరీస్ ‘హార్ట్ బీట్-రిథమ్ ఆఫ్ లైఫ్’. ఈ సిరీస్ ఒరిజినల్ వర్షెన్ తమిళ్ కాగా.. తెలుగులో కూడా డబ్ చేశారు. మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సిరీస్ గా సూపర్ సక్సెస్ అయ్యింది. ‘హార్ట్ బీట్’ కథ మొత్తం ఒక హాస్పిటల్ చుట్టూనే తిరుగుతుంది. అందులోకి కొత్తగా వచ్చిన ఇంటన్స్ (జూనియర్ డాక్టర్లు) వారే ఈ కథను నడుపుతారు. అద్భుతంగా అనిపించే ఈ సిరీస్ చూసే వారికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎంజాయ్, సస్పెన్స్, థ్రిల్, ఎమోషన్స్ ఇలా ప్రతీ అంశాన్ని డైరెక్టర్ అద్భుతంగా జోడించారు. ఇప్పటి వరకు సీజన్ 1కు విజయవంతంగా పూర్తయింది. సీజన్ 1లో 100 ఎపీసోడ్లను చేసిన మేకర్స్. 2025లో సీజన్ 2కు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
కథ..
ఆర్‌కే హాస్పిటల్ లో చీఫ్ డాక్టర్ రతి ఉంటారు. ఆమెనే హాస్పిటల్ కు మెయిన్ పిల్లర్. ఇక హాస్పిటల్ ఎండీ, ఆయన కొడుకు, ఐదుగురు ఇంటన్స్, ఇద్దరు సీనియర్ డాక్టర్స్, ఒకరు సూపర్ సీనియర్ డాక్టర్ (సినిమా డాక్టర్). మరొకరు బోర్డ్ మెంబర్. వీరి చుట్టూనే కథ తిరుగుతుంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే హాస్పిటల్ చీఫ్ డాక్టర్ రతికి వివాహం కాక ముందు ఒక కూతురు పుడుతుంది ఆ కూతురే ఇంటన్స్ లో ఉన్న రీనా (దీపా బాలు). ఇక వీరి చుట్టూనే కథ తిరుగుతుంది. రతినే తన తల్లి అని రీనా దాదాపు మొదటి పది ఎపీసోడ్స్ లోనే రివీల్ చేస్తుంది. కానీ తండ్రి ఎవరు? ఎందుకు హోమ్ లో విడిచిపెట్టింది? లాంటివి తెలియవు. వాటిని గురించి తెలుసుకునేందుకు రీనా హాస్పిటల్ లో చేరుతుంది. దీంతో పాటు తన తల్లికి దగ్గరగా ఉండవచ్చని హాస్పిటల్ కు వస్తుంది. ఈ సీక్రెట్ ఒక్కొక్కరిగా హాస్పిటల్ అందరికీ తెలుస్తుంది. లాస్ట్ ఎపీసోడ్స్ లో అది బయటకు కూడా రివీల్ అవుతుంది. దీంతో రతి రీనాను హాస్పిటల్ నుంచి వెళ్లాలని పంపించి వేస్తుంది. రీనా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. దీంతో తిరిగి మళ్లీ హాస్పిటల్ కు వస్తుంది. సీజన్ 2ను 2025లో తీసుకురానున్నట్లు తెలుస్తుంది.
పర్ఫార్మెన్స్..
అందరూ బాగా నటించారు. ఇందులో మెయిన్ రోల్ అయిన రీనా, రతి, హాస్పిటల్ ఓనర్ కొడుకుది. వీరు మరింత బాగా నటించారు. ప్రతీ ఒక్కరూ వారి వారి పాత్రకు తగ్గట్టుగా న్యాయం చేశారు. ఎవ్వరూ తగ్గలేదు. పైగా రతికి ఇద్దరు పిల్లలు ఉంటారు. వీరు కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేశారు. చివరి వరకు సిరీస్ ఎంగేజింగ్ గా సాగుతుంది.
సీజన్ 2 గురించి వెయిటింగ్..
సీజన్ 2 కోసం చాలా మంది ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. తన లైఫ్ నుంచి వెళ్లిపోవాలని తల్లి వేడుకోవడంతో హాస్పిటల్ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న రీనాకు రైల్వే స్టేషన్ లో తన తాత కనిపిస్తారు. దీంతో తిరిగి హాస్పిటల్ కు వస్తుంది. ఇప్పుడ రీనా ఏం చేస్తుంది..? తన తల్లి నోటి నుంచి తండ్రి గురించి వివరాలు బయట పెడుతుందా..? తనకు డైవర్స్ కావాలన్న రతి భర్తను ఆమె ఎలా కాంప్రమైజ్ చేస్తుంది. లాంటి చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ ఉండబోతోంది.