Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటు బుల్లి తెరపై అటు వెండితెరపై జిగేల్ మంటూ వెలిగిపోతోంది. లేటు వయసులోనూ ఘాలు అందాలతో అభిమానుల మతి పోగొడుతున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన హాట్‌హాట్ ఫొటోలను ఫాలోవర్స్, అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోల్లో ఒంటిపై ఉన్న పచ్చబొట్టు అందరినీ ఆకట్టుకుంటోంది.
కుటుంబానికి సమయం..
బుల్లితెర షోలు, వెండితెర సినిమాలతో బిసీగా ఉండే అనసూయ సమయం దొరికితే కుటుంబంతో గడుపుతారు. భర్త భరద్వాజ్ పిల్లలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. ప్రస్తుతం అనసూయ చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. టీవీ షోలు సరేసరి. అయినా ఇటు సోషల్ మీడియాకు, అటు కుటుంబాన్ని, ఇటు సినిమాలు, టీవీషోలను సమానంగా మెయింటేన్ చేస్తోంది.
Also Read: Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ కి క్రేజీ ఆఫర్లు.. ఇకనైనా స్టార్ హీరోయిన్ అవుతుందా ?
ఇకపోతే ఈమె తన శరీరంపై 2 టాటూలు వేయించుకున్న విషయం మనకు తెలిసిందే. ఈమె ఏడమ వైపు ఏద భాగంలో నిక్కు అనే టాటూ వేయించుకున్నారు. అయితే నిక్కు అంటే అర్థం ఏంటో ఇదివరకే అనసూయ వెల్లడించారు. తన భర్త శశాంక్ భరద్వాజ్ ముద్దు పేరు నిక్కు అని అందుకే అనసూయ ఆ పేరును టాటూగా వేయించుకున్నానని ఓ సందర్భంలో తెలిపారు. ఈ టాటూ మాత్రమే కాకుండా అనసూయ ఎడమ చేతిపై కూడా ఒక టాటూ వేయించుకున్నారు. ఈమె చేతిపై మనం కలోన్ అనే పదాన్ని టాటూగా కనిపిస్తుంది. నిజానికి ఇది ఇంగ్లీష్ పదం కాదు.
ఇది గ్రీకు పదం మరి ఈ పేరుకు అర్థం ఏమిటి అనే విషయానికి వస్తే.. సహజసిద్ధమైన అందం అనే అర్థం వస్తుంది. ఒక మనిషి బాహ్య అందాన్ని కాకుండా అంతర్గత అందాన్ని సూచిస్తుందని ఈ పదానికి అర్థం. మరి ఈ పదానికి అనసూయ ఎందుకు టాటూగా వేయించుకుందో తెలియదు. అయితే ఎప్పటికైనా ఈ పదానికి సరైన అర్థం ఏంటి ఈ పదాన్ని టాటుగా వేయించుకోవడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని అనసూయ చెప్పే వరకు వేచి ఉండాల్సిందే.
Also Read:Chiranjeevi – Ramya Krishna: చిరంజీవితో రమ్యకృష్ణ.. ఆమె క్యారెక్టర్ పై క్రేజీ అప్ డేట్