https://oktelugu.com/

KL Rahul-Athiya Shetty : మరో మూడు నెలల్లో కేఎల్ రాహుల్ పెళ్లి.. ఆయన మనసు దోచిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

KL Rahul-Athiya Shetty : టీమిండియాలో డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ గా కేఎల్ రాహుల్ కు పేరుంది. ప్రస్తుతం గాయపడి చికిత్స పొందుతున్నాడు. కానీ అతడి వ్యక్తిగత జీవితం ఇటీవల వార్తల్లోకెక్కింది. బాలీవుడ్ భామతో అతడి ప్రేమాయణం కంచికి చేరినట్టు వార్తలు వస్తున్నాయి. అతడు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఆ వార్తలకు తాజాగా మరింత ఊపు వచ్చింది. తాజాగా తన పెళ్లి విషయమై ఆ బాలీవుడ్ హీరోయిన్ స్పందించింది. పూర్తి క్లారిటీ ఇచ్చింది. టీమిండియా […]

Written By:
  • NARESH
  • , Updated On : July 13, 2022 / 08:02 PM IST
    Follow us on

    KL Rahul-Athiya Shetty : టీమిండియాలో డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ గా కేఎల్ రాహుల్ కు పేరుంది. ప్రస్తుతం గాయపడి చికిత్స పొందుతున్నాడు. కానీ అతడి వ్యక్తిగత జీవితం ఇటీవల వార్తల్లోకెక్కింది. బాలీవుడ్ భామతో అతడి ప్రేమాయణం కంచికి చేరినట్టు వార్తలు వస్తున్నాయి. అతడు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఆ వార్తలకు తాజాగా మరింత ఊపు వచ్చింది. తాజాగా తన పెళ్లి విషయమై ఆ బాలీవుడ్ హీరోయిన్ స్పందించింది. పూర్తి క్లారిటీ ఇచ్చింది.

    టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి పెళ్లి పీటలెక్కబోతున్నారని చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తన పెళ్లి విషయమై అతియ స్పందించింది. ఇన్ స్టా స్టోరీస్ లో ఈ మేరకు పోస్ట్ చేసింది. అభిమానులకు తీపి కబురును అందించింది. మరో మూడు నెలల్లో మా పెళ్లి జరగవచ్చని.. ఈ వివాహ వేడుకకు మిమ్మల్ని ఆహ్వానిస్తానంటూ క్యాప్షన్ అందించింది.

    బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తెనే అతియా శెట్టి. బాలీవుడ్ బిగ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ సుందరాంగి టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ తో ప్రేమలో పడింది. కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన విజయాన్ని ఆమె అందుకోలేకపోయింది.

    భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ తో అతియా ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీళ్లద్దరూ టూర్స్ కు వెళ్లి వస్తుండడం.. ఫొటోలు ఇన్ స్టాగ్రామ్ లో పెడుతుండడంతో వీరి ప్రేమ,పెళ్లిపై పుకార్లు షికార్లు చేశాయి.

    ఇక మూడు నెలల్లో పెళ్లికి రెడీ అయిన కేఎల్ రాహుల్-అతియా జంట ఇటీవలే పెళ్లి చేసుకున్న బాలీవుడ్ జంట రణ్ బీర్-ఆలియా ఇంటికి సమీపంలోనే వీరిద్దరూ ఓ ఫ్లాట్ తీసుకున్నారని.. వివాహమైన వెంటనే ఆ ఇంట్లోకి మకాం మార్చనున్నారని సమాచారం. ఈ వార్తల నేపథ్యంలోనే తమ పెళ్లి మరో మూడు నెలలు మాత్రమేనని అతియా క్లారిటీ ఇచ్చింది. కేఎల్ రాహుల్ ఓ ఇంటివాడు కాబోతుండడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.