Hero Nani 'The Paradise' movie Teaser
The Paradise’ movie Teaser : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టి, ఆ తర్వాత హీరో గా మారి, తనలో విలక్షణతని చూపిస్తూ సినిమా సినిమాకి తన మార్కెట్ ని పెంచుకుంటూ, నేడు ఈ స్థాయికి వచ్చిన హీరో నాని(Natural Star Nani).. ఒక లెవెల్ మార్కెట్ ఉన్న నాని ని, మరో లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘దసరా’ చిత్రమే. శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) అనే కొత్త దర్శకుడు ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. కొత్త దర్శకుడు అయినప్పటికీ నాని ని వేరే లెవెల్ లో చూపించి, విడుదలకు ముందే ప్రేక్షకులు ఈ సినిమా ఆతృతగా ఎదురు చూసేలా చేయడంలో శ్రీకాంత్ సక్సెస్ అయ్యాడు. ఆ ఎదురు చూపులకు తగ్గట్టుగానే సినిమా కూడా కమర్షియల్ గా పెద్ద హిట్టై బాక్స్ ఆఫీస్ వద్ద 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను అందుకొని సంచలనం సృష్టించింది.
మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘ది ప్యారడైజ్(The Paradise)’ అనే చిత్రం మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కాన్సెప్ట్ పోస్టర్ తోనే అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా కోసం కూడా ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గుట్టు చప్పుడూ కాకుండా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో కూడా సిద్ధంగా ఉందట. కానీ దీనికి అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అండ్ రీ రికార్డింగ్ చేయాల్సి ఉంది. త్వరలోనే ఆ పనులు పూర్తి చేస్తే ఫిబ్రవరి 20వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు చేయబోతున్నారు, విలన్ గా ఎవరు నటించబోతున్నారు, ఇతర క్యారెక్టర్స్ ఏమిటి అనేది తెలియాలంటే మరి కొద్దిరోజులు ఎదురు చూడాల్సిందే. జాన్వీ కపూర్ డేట్స్ కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె కాకపోతే వేరే బాలీవుడ్ హీరోయిన్ అని అంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే నాని నిర్మాతగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో త్వరలో మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) హీరో గా ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా గత ఏడాది చేసారు. ఇప్పటి వరకు అభిమానులు, ప్రేక్షకులు చూడని మెగాస్టార్ చిరంజీవి ని ఈ సినిమాలో చూపించబోతున్నాను అంటూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చెప్పుకొచ్చాడు. చిరంజీవి లో చూడని కోణం ఏముంది?, హీరోయిజం, విలనిజం, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్, డ్రామా ఇలా ప్రతీ యాంగిల్ ని గత నాలుగు దశాబ్దాలుగా చూపించాడు కదా, కొత్తగా చూపించడానికి ఏమి మిగిలాయి అని అభిమానులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన అనీల్ రావిపూడి తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక ఈ క్రేజ్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.