Pawan Kalyan Bro Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ చిత్రం ఈ నెల 28 వ తారీఖున గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని కొద్దిరోజుల క్రితమే విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎనేర్జిటిక్ రోల్ లో చూడాలని చాలా కాలం నుండి కోరుకుంటున్నారు.
వాళ్ళ కోరికకు తగ్గట్టుగానే ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ ని ఎంతో ఎనెర్జిటిక్ గా చూపించాడు డైరెక్టర్ సముద్ర ఖని. ఇక రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ చిత్రాలకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించి ఆ సినిమాల రేంజ్ ని మరింత పెంచిన థమన్, ఈ ‘బ్రో’ చిత్రానికి కూడా సంగీతం అందించాడు.
ఈ చిత్రం లో మొత్తం 5 పాటలు ఉంటాయని టాక్, రీసెంట్ గానే జర్మనీ లో సాయి ధరమ్ తేజ్ మీద ఒక సాంగ్ ని చిత్రీకరించారు. అయితే వీటిల్లో టైటిల్ సాంగ్ ని ఈ శనివారం రోజు విడుదల చెయ్యబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు లేదా రేపు ఎదో ఒక సమయం లో చెయ్యబోతున్నారు.ఈ చిత్రం లో మూడు పాటలు అద్భుతంగా వచ్చాయని టాక్.
అందులో పార్టీ సాంగ్ బాగా వైరల్ అయ్యే ఛాన్స్ ఉందట. ఈ పాటలో ఊర్వశి రౌతుల పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ తో కలిసి చిందులు వేసింది. ఈ పాట విడుదలైతే ఎక్కడ చూసినా కేవలం ఈ పాట తప్ప మరో పాట వినిపించాడని అంటున్నారు ఈ సినిమాకి సంబంధించిన సన్నిహిత వర్గాలు. చూడాలి మరి అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ పాట ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది.