https://oktelugu.com/

Niharika Chaitanya Divorce: నిహారిక-వెంకట చైతన్య… ముందుగా విడాకులు కోరింది ఎవరంటే?

విడాకుల నోటీసుల్లో పిటీషనర్ గా వెంకట చైతన్య ఉన్నాడు. ఇక డిపెండెంట్ గా నిహారిక పేరును చేర్చారు. అంటే వెంకట చైతన్యనే నిహారిక నుండి విడాకులు కోరుకున్నారు. ఆయనే కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నట్లు సమాచారం. విడాకుల వార్తలకు బీజం వేసింది కూడా వెంకట చైతన్యనే. అతడు ఇంస్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు డిలీట్ చేశాడు.

Written By:
  • Shiva
  • , Updated On : July 5, 2023 / 11:34 AM IST

    Niharika Chaitanya Divorce

    Follow us on

    Niharika Chaitanya Divorce: నిహారిక కొణిదెల విడాకులు అధికారికం. మొన్నటి వరకు ఒక సందిగ్ధత కొనసాగింది. గొడవలతో దూరమైనా మళ్ళీ కలిసిపోతారనే ఊహాగానాలు వినిపించాయి. లేదు ఆల్రెడీ విడాకులు అయ్యాయంటూ కొందరు అభిప్రాయ పడ్డారు. ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. నిహారిక-వెంకట చైతన్య విడాకులు పిటిషన్ ఆన్లైన్లో చక్కర్లు కొడుతుంది. కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో వీరు విడాకుల కోసం అప్లై చేశారు. నిహారిక-వెంకట చైతన్యలలో ఎవరు విడాకులు కోరారు? ఆ ఆలోచన ముందుగా ఎవరికి వచ్చిందనే సందేహాలు కూడా తొలిగిపోయాయి?

    విడాకుల నోటీసుల్లో పిటీషనర్ గా వెంకట చైతన్య ఉన్నాడు. ఇక డిపెండెంట్ గా నిహారిక పేరును చేర్చారు. అంటే వెంకట చైతన్యనే నిహారిక నుండి విడాకులు కోరుకున్నారు. ఆయనే కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నట్లు సమాచారం. విడాకుల వార్తలకు బీజం వేసింది కూడా వెంకట చైతన్యనే. అతడు ఇంస్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు డిలీట్ చేశాడు.

    దాంతో విబేధాలు తలెత్తాయనే పుకార్లు చెలరేగాయి. నిహారిక మాత్రం పెళ్లి ఫోటోలు డిలీట్ చేయలేదు. బహుశా నిహారిక వెంకట చైతన్య మనసు మార్చే ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఆయన విడాకులకు మొగ్గు చూపిన తరుణంలో ఆశలు వదులుకున్నాక ఆమె కూడా పెళ్లి ఫోటోలు డిలీట్ చేశారు. అలా ఇద్దరు తమ జ్ఞాపకాలు సోషల్ మీడియా అకౌంట్స్ నుండి తొలగించారు. విడాకుల ఊహాగానాల నేపథ్యంలో నిహారిక కెరీర్ మీద ఫోకస్ పెట్టారు. ఆమె హైదరాబాద్ లో ప్రొడక్షన్ ఆఫీస్ ఓపెన్ చేశారు.

    నటిగా బిజీ అయ్యారు. పలు ప్రాజెక్ట్స్ కి సైన్ చేశారు. పింక్ ఎలిఫెంట్ బ్యానర్లో చిత్రాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఒక మనసు మూవీతో నిహారిక హీరోయిన్ అయ్యారు. తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి చిత్రాల్లో నటించారు. సైరా నరసింహారెడ్డి చిత్రంలో గెస్ట్ రోల్ చేశారు. హీరోయిన్ గా బ్రేక్ రాలేదు. ఈ క్రమంలో 2020లో వెంకట చైతన్యను వివాహం చేసుకున్నారు.