Bigg Boss Telugu 8 : ఎన్నో భారీ అంచనాల నడుమ మొదలైన బిగ్ బాస్ సీజన్ 8 నేటితో ముగియబోతుంది. ఈ సీజన్ ప్రథమార్థం చప్పగానే సాగినప్పటికీ, ద్వితీయార్థం మాత్రం బాగానే సాగింది. వైల్డ్ కార్డ్స్ ఈ సీజన్ కి ఊపిరి పోశారు అని చెప్పొచ్చు. అయితే బిగ్ బాస్ గేమ్ అనేది కేవలం టాస్కులు ఆడడం, గెలవడం ఒక్కటే కాదు, ఒక మనిషి వ్యక్తిత్వం ఎలాంటిది అనేది కూడా నిర్ణయిస్తుంది అని చెప్పడానికి విష్ణు ప్రియ ఒక ఉదాహరణగా నిల్చింది. ఈమె మొదటి వారం నుండి 14వ వారం వరకు తన మనస్తత్వం పై ఎలాంటి మాస్క్ వెయ్యకుండా, తనకి ఏదైతే అనిపించిందో అది చేసుకుంటూ పోయింది. ఇంత నిజాయితీ గల కంటెస్టెంట్ ని కేవలం సీజన్ 8 లోనే కాదు, భవిష్యత్తులో కూడా చూడలేము. ఇది మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. అయితే విష్ణు ప్రియ మిగిలిన ఎపిసోడ్స్ లో ఎలా ఉన్నా, వీకెండ్ ఎపిసోడ్స్ లో దుమ్ము లేపేది.
ముఖ్యంగా ఫినాలే మొత్తం విష్ణు హవానే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ కాసేపటి క్రితమే విడుదల చేసిన ప్రోమోలో విష్ణు ప్రియ కనిపించకపోవడం ఆమె అభిమానులను తీవ్రమైన నిరాశకు గురయ్యేలా చేసింది. విష్ణు ప్రియ ఫినాలే కి మాత్రమే కాదు, బయటకి వచ్చిన తర్వాత తన తోటి కంటెస్టెంట్స్ లో సీత ని తప్ప ఎవ్వరినీ కలవలేదు. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆమె నైనిక, సీత, యష్మీ, పృథ్వీ వంటి వాళ్ళతోనే ఎక్కువగా క్లోజ్ గా ఉంటూ వచ్చింది. ముఖ్యంగా పృథ్వీ వెంట ఈమె ఏ రేంజ్ లో తిరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ బయటకి వచ్చిన తర్వాత అతన్ని కలవలేదు. కనీసం అతని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. షో అయిపోయిన తర్వాత ప్రతీ కంటెస్టెంట్ తమ అభిమానులతో ప్రత్యేకంగా ఫ్యాన్స్ మీట్ పెట్టుకుంటారు. కేక్ కట్టింగ్స్ చేస్తారు, అలాంటిదేమో విష్ణు ప్రియ చేయలేదు.
కేవలం బయటకి వచ్చిన తర్వాత తన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేసి, తనకి ఓట్లు వేసి ఇంత దూరం తీసుకొచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. ఇక ఆ తర్వాత కనిపించకుండా పోయింది. పృథ్వీ తో ఆమె నడిపిన లవ్ ట్రాక్ బయటకి వెళ్లిన తర్వాత ఆమెకి ఇబ్బందులను గురి చేసిందా? , ఇంట్లో ఏమైనా గొడవలు అయ్యాయా?, తనపై ఎన్నో ఆశలు పెట్టుకొని, విష్ణు ప్రియ కోసం ఎదురు చూస్తున్న మాజీ ప్రియుడు ఆమెని అనరాని మాటలు ఏమైనా అన్నాడా?, అసలు ఏమి జరిగింది?, తనతో ఎంతో స్నేహంగా ఉండే రీతూ చౌదరి ని కూడా ఆమె హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత కలవలేదు. కచ్చితంగా ఎదో జరిగింది అంటూ విష్ణు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రాండ్ ఫినాలే ప్రోమో లో కామెంట్స్ మొత్తం విష్ణు ప్రియ ని మిస్ అవుతున్నాం అనే వచ్చాయి. కనీసం ఎపిసోడ్ లో అయినా ఆమె రాకపోవడానికి గల కారణం చెప్తారో లేదో చూద్దాం.