Game Changer : శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికా లో ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఇప్పటివరకు అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఇండియన్ సినిమా ఒక్కటి కూడా లేదు. ఇక ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఈ సినిమా ఒక చరిత్రను క్రియేట్ చేయబోతుందనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా శంకర్ ఈ సినిమాను చాలా అద్భుతంగా మలిచినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే రామ్ చరణ్ మరోసారి తన స్టామినాను చూపించిన వాడవుతాడు. దాంతో పాటుగా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని అందుకున్న హీరోగా కూడా తనకంటూ ఒక క్రెడిట్ అయితే దక్కుతుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ ని సాధించబోతుందనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది ప్రముఖులు ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్టు లుగా హాజరవ్వబోతున్నారనే విషయం అయితే చాలా స్పష్టం గా తెలుస్తోంది. ఇక అందులో ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, సుకుమార్ పేర్లు ప్రథమంగా వినిపిస్తున్నాయి. వీళ్ళు ముగ్గురు గేమ్ చేంజర్ సినిమాకి ముఖ్య అతిథులుగా రాబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక సుకుమార్ రామ్ చరణ్ తో తన తదుపరి సినిమాను చేయబోతున్నాడు కాబట్టి ఆయన ఈ సినిమాకి గెస్ట్ గా రావాల్సిందిగా రామ్ చరణ్ కోరినట్టుగా కూడా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా సుకుమార్ కూడా ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. దాంతో ఆయన కూడా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ వినూత్న కార్యక్రమానికి హాజరు అవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈవెంట్ గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా యూనిట్ నుంచి మరి కొంతమంది స్పందించాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్, సుకుమార్ మాత్రం ఈవెంట్ కి తప్పకుండా హాజరవుతారని సినిమా యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా వ్యక్తం చేస్తున్నారు.
ఇక వీళ్ళు వస్తే సినిమాకి చాలా మంచి బజ్ వస్తుందనే ఉద్దేశ్యం తో రామ్ చరణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక వీళ్లతో పాటు చిరంజీవి కూడా ఎలాగూ వస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా భారీ రేంజ్ లో సక్సెస్ ని సాధించడానికి ఈ ఈవెంట్ కూడా కారణం కాబోతుందనేది ప్రతి ఒక్కరి నోట వినిపిస్తున్న మాట…