Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ స్టార్టింగ్ లోనే వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ సాధించాడు. తొలిప్రేమ, బద్రి, ఖుషి లాంటి సినిమాలతో స్టార్ హీరోగా అవతరించాడు… ఇక ఆ ఊపు చూసిన ట్రేడ్ పండితులు సైతం వీలైనంత తొందరగా పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి ని బీట్ చేస్తాడు అని అనుకున్నారు. కానీ అప్పుడు జరిగిన కొన్ని అనుకోని కారణాల వల్ల అతనికి వరుసగా 10 సంవత్సరాలపాటు చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. దానికి కారణం ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఆయన చేసిన సినిమాల్లో అతని యాక్టింగ్ గాని, సినిమా సెలక్షన్స్ గాని బాగున్నప్పటికి ఆ మూవీస్ ప్లాప్ అయ్యేవి…కారణం ఏంటంటే ఆయా దర్శకుల పవన్ కళ్యాణ్ ను పెర్ఫెక్ట్ గా చూపించలేదని చాలా మంది చెబుతుంటారు…
ఇక ఎప్పుడైతే గబ్బర్ సింగ్ సినిమా వచ్చిందో అప్పుడు పవన్ కళ్యాణ్ లోని పూర్తి స్థాయి నటుడు కనిపించాడు. ఆయన జోవియల్ గా ఉంటూ ఇతరుల మీద పంచులు వేసుకుంటూ చాలా యాక్టివ్ గా కనిపించాడు. అలాంటి పవన్ కళ్యాణ్ ను మరోసారి చూడాలని ప్రేక్షకులు సైతం కోరుకుంటున్నారు. ఇక గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఆయన ‘అత్తారింటికి దారేది’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.
ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికి సమయం దొరికిన ప్రతిసారి సినిమాల మీద తన సమయాన్ని కేటాయించే ప్రయత్నమైతే చేస్తుంటాడు. ఇక ఈ సంవత్సరం ఆయన చేసిన రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో హరిహర వీరమల్లు ఫ్లాప్ ను మూట గట్టుకుంటే ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించాడు. ఇక మొత్తానికైతే ఓజీ మూవీ అతని అభిమానుల దాహాన్ని తీర్చేసింది.
అభిమానులకు చాలా రోజుల ఉపవాసం తరువాత బిర్యానీతో భోజనం పెట్టినంత హై ఫీల్ ఇచ్చింది…అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు వచ్చాడని కాదు. ఆయన వచ్చిన ప్రతిసారి ఏదో ఒక రికార్డును క్రియేట్ చేస్తాడు అంటూ తన అభిమానులు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక పాన్ ఇండియాలో రిలీజ్ అయిన ఓజీ సినిమా దాదాపు 400 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టడం అనేది మామూలు విషయం కాదు…