Dulquer Salmaan: మలయాళం సినిమా ఇండస్ట్రీలో మమ్ముట్టి, మోహన్ లాల్ వీళ్ళిద్దరూ డిఫరెంట్ క్యారెక్టర్ లను చేస్తూ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు వాళ్ళ పంథాను మార్చుకొని ప్రేక్షకుల అభిరుచి మేరకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి సినిమాని చేస్తూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి సంపాదించుకున్నారు… రెమ్యునరేషన్ విషయంలో వీళ్ళు పెద్దగా డిమాండ్ చేయరు. కథ నచ్చితే అది ఎంత లో బడ్జెట్లో మూవీ అయిన సరే సినిమాని చేసి సక్సెస్ ఫుల్ గా నిలపాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్లిద్దరూ మలయాళం ఇండస్ట్రీకి రెండు కండ్లు గా మారారనే చెప్పాలి… ఇక మమ్ముట్టి కొడుకు అయిన దుల్కర్ సల్మాన్ సైతం డిఫరెంట్ పాత్రలను చేస్తున్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో భారీ బడ్జెట్ తో సినిమాలను చేయచ్చు కానీ ఆయన మాత్రం సెలెక్టెడ్ సినిమాలను చేస్తూ తన మనసుకు నచ్చిన సినిమాలను మాత్రమే ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక కెరియర్ స్టార్టింగ్ లో తనకు నటన రాదు అంటూ చాలా విమర్శలను ఎదుర్కొన్న దుల్కర్ సల్మాన్ చాలా తక్కువ సమయంలోనే ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. విలక్షణ నటుడిగా గొప్ప గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. పాజిటివ్, నెగెటివ్ ఎలాంటి పాత్రలో అయినా తను మెప్పించగలననే పేరైతే సంపాదించుకున్నాడు… ఇక తను కెరియర్ మొదట్లో యాక్టింగ్ పరంగా, లుక్స్ పరంగా డిఫరెంట్ గా ఉండటంతో ఆయన్ని విమర్శించారు…కానీ ఆయన తన సత్తా చాటి అందరికి సమాధానం చెప్పాడు…
సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి రెండు తెలుగు సినిమాలను చేసి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ఇక ప్రస్తుతం తెలుగులో మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ అయ్యాడు… ఇక రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఇండస్ట్రీ లో బ్యా గ్రౌండ్ వారసత్వం ఉందని కామ్ గా కూర్చుంటే పనవదు.
మా మీద కూడా విమర్శలు వస్తుంటాయి. వాటిని తిప్పికొడుతూ మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగినప్పుడు మాత్రమే ప్రేక్షకులందరు మనకు నిరాజనాలు పడతారు అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. రీసెంట్ గా ఆయన ‘కాంత’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయిందనే చెప్పాలి…
ఇకమీదట రాబోతున్న సినిమాల విషయంలో ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. తద్వారా డిఫరెంట్ క్యారెక్టర్ లను సెలెక్ట్ చేసుకొని తనలోని విలక్షణమైన నటుడిని బయటికి తీసి ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…