Richa Gangopadhyay: టలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకున్నారు ఎందరో ముద్దుగుమ్మలు. వారిలో మన్మథుడు అన్షు, మిరపకాయ రిచాగంగోపాధ్యాయలు ఉన్నారు. దగ్గుబాటి రానా నటించిన ‘లీడర్’ సినిమాతో ఫేమస్ అయిన రిచా గంగోపాధ్యాయా చాలా తెలుగు సినిమాల్లో నటించింది. అయితే స్టార్ రేంజ్ ను మాత్రం దక్కించుకోలేకపోయింది. దీంతో ఈ భామ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగలేక మధ్యలోనే విడిచి వెళ్లింది. అయితే అందాలతో కవ్వించిన ఈ బ్యూటీ మధ్యలోనే వెళ్లడానికి అందరూ స్టడీ కోసం కావొచ్చు అని అనుకున్నారు. కానీ అసలు కారణం వేరే ఉందంటున్నారు. ఓ స్టార్ హీరో ప్రవర్తనే తాను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవడానికి కారణమని తరువాత తెలిసింది.
టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించింది రిచా గంగాపాధ్యాయ. ఈ భామను తెలుగులో శేఖర్ కమ్ముల ‘లీడర్’ సినిమా ద్వారా పరిచయం చేశారు. ఆ తరువాత రెండో సినిమా ‘నాగవల్లి’లో చంద్రముఖి పాత్రలో నటించి ఆకట్టుకుంది. దీంతో ఆమె రవితేజతో మిరపకాయ్, ప్రభాస్ తో మిర్చి, తదితర సినిమాల్లో నటించింది. అయితే కెరీర్ మంచి ఊపులో ఉండగానే ఈ అమ్మడు సినిమాల నుంచి సడెన్లీగా మాయమైంది. అప్పటి వరకు రిచాకు ఫ్యాన్స్ గా ఉన్నవారు సినిమాల నుంచి తప్పుకోవడానికి కారణమేంటి..? అని తీవ్రంగా చర్చించుకున్నారు. అయితే ఆమె లండన్ వెళ్లి పోవడంతో హైయ్యర్ స్టడీస్ కోసమని అనుకున్నారు.
Also Read: Samantha- Preetham Jukalker: ఎన్ని విమర్శలు వచ్చినా అతన్ని వదలనంటున్న సమంత!
కానీ ఒక్కసారి ఓ వ్యక్తితో పెళ్లి చేసుకొని అందుకు సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ భామ ఇక సినిమాలు చేయదని డిసైడ్ అయ్యారు. ఇటీవల ఓ పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చిన ఈమె ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. చాలా కాలం తరువాత ఈమె గురించి ఓ న్యూస్ సర్కిల్ అవుతోంది. రిచా సినిమాల నుంచి తప్పుకోవడానికి కారణమేంటి..? అనే ప్రశ్నలు సంధించగా కొందరు అసలు విషయం బయటపెట్టారట. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ హీరో ప్రవర్తనే ఆమె కెరీర్ కు పులిస్టాప్ పెట్టిందని అంటున్నారు.
రిచాతో నటించిన ఓ స్టార్ హీరోతో ఆమె చనువుగా ఉంటూ వచ్చింది. ఆ హీరో కూడా అంతే స్థాయిలో రోమాన్స్ వరకు వెళ్లడట. అయితే ఇక తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా సంకేతాలు ఇచ్చిందట. అయితే అసలు సమయం వచ్చేసరికి ఆ హీరో ఒప్పుకోలేదట. అంతేకాదు.. నీ అందానికి నేను సరిపోతానా..? అంటే ఛీప్ గా మాట్లాడాట. అందుకే ఇక సినిమా ఫీల్డ్ లో ఉండడం దండగ అని రిచా ఇక్కడి నుంచి ఏకంగా లండన్ వెళ్లిపోయిందట. అయితే ఆమెతో ఇలా ప్రవర్తించిన హీరో ఎవరని కొందరు చర్చించుకుంటున్నారు.
Also Read: Pawan kalyan- Rajamouli: పవన్ తో రాజమౌళి మూవీ? కథ సిద్ధం చేస్తున్న విజయేంద్రప్రసాద్!