Money Bags In Beggar Room: చేసేది యాచకం. ఇంటింటా తిరిగి యాచించుకుంటునే కానీ పూట గడవని స్థితి అతడిది. కానీ ఆయన ఇంట్లో చూస్తే మాత్రం నోట్ల కట్టలు. మీరు వింటున్నది నిజమే. కాకినాడలో ఓ యాచకుడు హఠాన్మరణం చెందాడు. విషయం తెలిసి వెళ్లిన పోలీసులకు మైండ్‌బ్లాక్ అయ్యింది. అతను ఉంటున్న గదిలో నోట్ల సంచులు బయటపడ్డాయి. కరప మండలం వేళంగిలో ఈ ఘటన జరిగింది. బిక్షాటన చేసే సాధువు రామకృష్ణ గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి ఉంటున్న గదిలో రెండు సంచులు కనిపించాయి. వాటి నిండా నోట్ల కట్టలు.. చిల్లర నాణేలు ఉన్నాయి. రెవెన్యూ, పోలీసు అధిజారుల సమక్షంలో డబ్బులను లెక్కించారు గ్రామస్ధులు. మొత్తంగా సుమారు రూ.2 లక్షల దాకా బయటపడింది.
రామకృష్ణకు నా అనేవారు లేరు. ఐదేళ్ల కిందట వేళంగి గ్రామానికి వచ్చాడు. జనాలకు రక్షరేకులు కడుతూ.. భిక్షాటన చేసుకుంటూ గడిపేవాడు. స్థానిక చేపల మార్కెట్ సమీపంలో ఓ గదిలో ఉంటూ.. సమీపంలో సత్రంలో తింటూ ఉండేవాడు. గురువారం గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు.. తనికీ చేపట్టగా నోట్ల సంచులు బయటపడ్డాయి. ఈ నోట్ల కట్టల సంచులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Also Read: Richa Gangopadhyay: ఆ స్టార్ హీరో వల్లే సినీ ఇండస్ట్రీని వదిలేసిన హీరోయిన్ రిచా?
రామకృష్ణ అందరితో కలివిడిగా ఉండేవాడని.. అతడి దగ్గర అంత డబ్బు ఉంటుందని ఎవరికీ తెలియదని గ్రామస్థలు చెబుతున్నారు. నా అనేవారు లేరని అంతర్మథం చెందేవాడని అక్కడున్న వారు చెబుతున్నారు. మొత్తానికి ఈ ఘటన సంచలనమైంది. అంతటా చర్చనీయాంశంగా మారింది.
Also Read:Viral News: ఒకే బిడ్డకు రెండు సార్లు జన్మనిచ్చిన తల్లి.. అసలు విషయం తెలిస్తే షాక్