The Raja Saab: ప్రభాస్ హీరో గా నటించిన ‘రాజా సాబ్’ చిత్రం విడుదలకు సరిగ్గా 13 రోజుల సమయం మాత్రమే ఉంది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన ప్రతీ సినిమా ఎంతటి హంగామా తో విడుదల అయ్యేవో ప్రత్యేకంచి చెప్పనవసరం లేదు. సినిమా హిట్/ ఫ్లాప్ అనేది కాసేపు పక్కన పెడితే ఓపెనింగ్స్ సెన్సేషనల్ గా ఉండేవి. బాహుబలి తర్వాత ఆయన 5 సినిమాలు చేస్తే అందులో మూడు సినిమాలు మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినవి ఉన్నాయి అంటేనే అర్థ చేసుకోవచ్చు. ప్రభాస్ సినిమాలకు మార్కెట్ లో ఉన్న విలువ ఎలాంటిది అనేది. కానీ ‘రాజా సాబ్’ చిత్రం మాత్రం ఆ రేంజ్ మేనియా, హైప్, యుఫోరియా ని ఆడియన్స్ లో క్రియేట్ చేయడం లో విఫలం అయ్యింది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి చాలా ప్రమోషనల్ కంటెంట్ బయటకు వచ్చింది. కానీ ఒక్కటి కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు.
ఇక ఈ సినిమాకు మిగిలిన ఆశలు ఏమైనా ఉన్నాయా అంటే, అది ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మాత్రమే. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్లు, అదే విధంగా USA లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయడానికి ఫిక్స్ అయ్యారు మేకర్స్ . నేడు సాయంత్రం హైదరాబాద్ లోని కూకట్ పల్లి గ్రౌండ్స్ లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ కి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తి అయ్యాయి. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఒక సెంటిమెంట్ కలవరపెడుతోంది. ఇప్పటి వరకు కూకట్ పల్లి గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని జరుపుకున్న ఒక్క సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. ఇది ఒక ఐరన్ లెగ్ లొకేషన్ అనే పేరు ఇండస్ట్రీ లో గట్టిగా వినపడుతోంది.
అలాంటి చోట ఏరికోరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చెయ్యాలని ఎవ్వరూ కోరుకోరు. కానీ రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే జరుగుతోంది అంటే, మేకర్స్ కి అసలు ఈ సినిమా ఫలితం పై పట్టింపు లేదా?, ప్రభాస్ కి తెలుసు కదా?, ఆయన ఎందుకు మౌనం గా ఉన్నాడు?, ఈ సినిమా పై ఆయనకు ఇసుమంత నమ్మకం కూడా లేదా?, ఎదో ఒకలాగా ఈ సినిమా విడుదల అయిపోతే సగం భారం తగ్గుతుంది అనే మూడ్ లోనే ఆయన ఉన్నాడా? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే ఈ చిత్ర నిర్మాత విశ్వప్రసాద్ కి ఒక గొప్ప పేరుంది. ఆయనకు అరుణాచలం లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉందని. తానూ సంపాదించిన డబ్బు మొత్తం పోగొడితే పెద్ద నిధి దొరుకుతుంది అని ఆయనకు ఎవరో ఆఫర్ పెట్టినట్టు ఉన్నారు. అందుకే నష్టపోయే సినిమాలనే ఆయన ఎంచుకుంటున్నాడు, రాజా సాబ్ న ఫ్లాప్ చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు అంటూ కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.