Rajamouli And Sukumar: సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… పుష్ప సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులందరిని మెప్పించింది… ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఈ సినిమాలో ఇచ్చిన ఎలివేషన్స్ కి ఫిదా అయిపోయారు. ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ ను హీరోగా పెట్టి ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. వీళ్ళ కాంబోలో ఇంతకు ముందు రంగస్థలం సినిమా వచ్చి రికార్డు కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. రామ్ చరణ్ చేస్తున్న సినిమాతో ఎలాంటి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తాడు..ఇండియాలోనే తను నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక సుకుమార్ సినిమాల్లో రాజమౌళి కి బాగా నచ్చిన సినిమా ఏంటి అని అడగగా ఆయన జగడం మూవీ అని సమాధానం చెప్పాడు. కారణం ఏంటంటే సుకుమార్ ఈ సినిమాలో తన బెస్ట్ వర్క్ ఇచ్చాడని చెప్పాడు. అలాగే ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంటుందని చెప్పాడు.
మొత్తానికైతే సుకుమార్ తనకి పోటీ ఇచ్చే డైరెక్టర్ అని రాజమౌళి చెప్పడం అప్పట్లో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం రాజమౌళి సైతం మహేష్ బాబు తో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాన్ వరల్డ్ ప్రేక్షకులను మెప్పించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఇప్పటి వరకు ఎవరు అందుకోలేని ఒక గొప్ప ఫీట్ ను రాజమౌళి ఈ సినిమా తో అచివ్ చేయబోతున్నాడనేది క్లారిటీ గా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి డైరెక్టర్ ఉండటం నిజంగా తెలుగు ఇండస్ట్రీ అదృష్టమనే చెప్పాలి. రాజమౌళి ఎంత గొప్ప స్థాయి కి వెళ్ళిన ఆయన చాలా ఒదిగి ఉంటాడు. అందుకే ఆయన వ్యక్తిత్వంతో కూడా చాలా మంది మనసు గెలుచుకున్నాడు…