https://oktelugu.com/

Kiran Abbavaram ‘Ka’ Movie : కిరణ్ అబ్బవరం ‘క’ ఓటీటీ విడుదల పై నిర్మాతలు సంచలన ప్రకటన..దయచేసి అక్కడే చూడాలంటూ విజ్ఞప్తి!

ఈ సినిమా డిజిటల్ + సాటిలైట్ రైట్స్ ని ఈటీవీ సంస్థ 10 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని నవంబర్ 21వ తారీఖున ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ చేస్తారని పెద్ద ఎత్తున ఒక ప్రచారం సాగింది. దీనిపై నిర్మాతలు ట్విట్టర్ ద్వారా స్పందించారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 7, 2024 / 02:53 PM IST

    Kiran Abbavaram 'Ka' Movie

    Follow us on

    Kiran Abbavaram ‘Ka’ Movie : కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘క’, ఈ దీపావళి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా అతి తక్కువ థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ఎన్నో సవాళ్ళను ఎదురుకొని సూపర్ హిట్ గా నిల్చింది. ఈ చిత్రానికి ముందు కిరణ్ అబ్బవరం ఎన్ని ఇబ్బందులను ఎదురుకున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నెలకు ఒక సినిమా చేస్తాడని, అన్ని చెత్త సినిమాలే అని, కిరణ్ అబ్బవరం కి యాక్టింగ్ అంటే ఏంటో తెలియదని, ఇలా ఒక్కటా రెండా ఎన్నో రకాల కామెంట్స్ ని ఆయన ఎదురుకోవాల్సి వచ్చింది. సోషల్ మీడియా లో వచ్చే ఇలాంటి ట్రోల్స్ ని చూసి ఎంతో బాదపడ్డ కిరణ్ అబ్బవరం, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎంతలా ఎమోషనల్ అయ్యాడో మన కళ్లారా చూసాము. అయ్యో పాపం..ఇతను కొడితే బాగుండును అని ప్రేక్షకులు కోరుకున్నారు. వాళ్ళ కోరికలు బలంగా ఫలించాయి, ‘క’ చిత్రం అనుకున్న దానికంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది.

    కేవలం మొదటి వారంలోనే ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 26 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు కనీసం 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు. అలాంటిది ‘క’ చిత్రానికి వాటికి మొదటి వారం లోనే మూడింతల లాభాలు వచ్చాయి. ఫుల్ రన్ లో కచ్చితంగా పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయని మేకర్స్ బలమైన నమ్మకంతో ఉన్నారు. ఇదంతా పెడితే ఈ సినిమా డిజిటల్ + సాటిలైట్ రైట్స్ ని ఈటీవీ సంస్థ 10 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని నవంబర్ 21వ తారీఖున ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ చేస్తారని పెద్ద ఎత్తున ఒక ప్రచారం సాగింది. దీనిపై నిర్మాతలు ట్విట్టర్ ద్వారా స్పందించారు.

    నిర్మాతలు మాట్లాడుతూ ‘క చిత్రం థియేటర్స్ లో అద్భుతంగా రన్ అవుతుంది. ఇప్పట్లో ఈ చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేసే ప్రసక్తే లేదు. సోషల్ మీడియా లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. మంచి థియేట్రికల్ షేర్స్ వస్తున్న ఈ సమయంలో ఇలాంటికి అసత్య ప్రచారాల కారణంగా మాకు నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది..కాబట్టి దయచేసి ఇలాంటి వార్తలను ప్రచారం చేయకండి. థియేటర్స్ లో మాత్రమే క చిత్రాన్ని చూసి అద్భుతమైన అనుభూతిని పొందండి’ అంటూ చెప్పుకొచ్చారు. ఈమధ్య కాలం లో విడుదలైన ప్రతీ సినిమాకి ఇలాంటి ప్రచారాలు జరగడం సర్వసాధరణం అయిపొయింది. ఈ ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ వీకెండ్ తో ఈ చిత్రం కచ్చితంగా 20 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.