Hari Hara Veera Mallu: 2022 వ సంవత్సరంలో విడుదలైన ‘భీమ్లా నాయక్’ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి మరో సినిమా రాలేదు. మధ్యలో ‘బ్రో ది అవతార్’ చిత్రం వచ్చినప్పటికీ అందులో ముఖ్య పాత్ర కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా అని అనలేము. ఈ మూడేళ్ళ సమయంలో మన టాలీవుడ్ మార్కెట్ ఎంతో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ ప్రాంతాల్లో మన మార్కెట్ ఇంతకు ముందుకంటే పది రెట్లు ఎక్కువ పెరిగింది. మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా ఓవర్సీస్ లో భారీ వసూళ్లు వస్తున్నాయి. ఇలాంటి పీక్ మార్కెట్ ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైతే ఎలా ఉంటుందో చూడాలని అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రీమేక్ సినిమాలతోనే ఆల్ టైం రికార్డ్స్ ఓపెనింగ్స్ ని రాబట్టే పవన్ కళ్యాణ్, పాన్ ఇండియా సినిమాతో మన ముందుకి వస్తే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం.
ప్రస్తుతం ఆయన చేస్తున్న చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ విడుదలకు సిద్ధం గా ఉంది. షూటింగ్ కార్యక్రమాలు 90 శాతంకి పైగా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించి చాలా రోజులే అయ్యింది. అయితే VFX వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉందని, అనుకున్న సమయానికి చిత్రం విడుదల కాకపోవచ్చని, ఏప్రిల్ లేదా మే నెలకు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, ‘హరి హర వీరమల్లు’ కంటే ముందుగా ‘ఓజీ’ చిత్రం వస్తుందని, ఇలా పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో ప్రచారమయ్యాయి. ఇవి నిర్మాత వరకు చేరడంతో నేడు మరోసారి ఆయన మీడియా కి మార్చి 28న సినిమాని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ ఖరారు చేయడంతో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.
వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమాకి సంబంధించిన రెండవ పాటని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ కాంబినేషన్ లో సాగే ఈ పాట చార్ట్ బస్టర్ గా నిలుస్తుందని సమాచారం. ఇప్పటికే ఈ చిరం నుండి ఇటీవలే విడుదలైన ‘మాట వినాలి’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. యూట్యూబ్ లో ఈ పాటను దాదాపుగా 29 లక్షల మంది చూసారు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ పాడిన పాట కావడంతో తక్కువ నిడివి ఉన్నప్పటికీ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. మరి రెండవ పాట సినిమా పై మరింత అంచనాలు పెంచేలా చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ సినిమాకి సంబంధించి కేవలం 7 రోజుల పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ అవసరముంది. మార్చి 10 లోపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేసి మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.