Sankranthiki Vasthunnam Collection: నిన్న గాక మొన్న విడుదల అయినట్టు అనిపిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం అప్పుడే మూడు వారాలు పూర్తి చేసుకుంది. మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న ఈ సినిమా, ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు వెళ్తుండడాన్ని చూస్తుంటే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ని మాత్రమే కాదు, ప్రతీ మూవీ లవర్ ని ఈ చిత్రం థియేటర్స్ లో పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వించింది. చాలా కాలం తర్వాత ఒక మంచి కామెడీ చిత్రాన్ని చూసిన అనుభూతి ఈ చిత్రం ద్వారా ఆడియన్స్ కి కలిగింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఒక సినిమాకి కనెక్ట్ అయ్యారంటే వసూళ్లు ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు. మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 21వ రోజు తెలుగు రాష్ట్రాల నుండి 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
ప్రాంతాల వారీగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం లో 41 కోట్ల 30 లక్షలు, సీడెడ్ ప్రాంతం లో 18 కోట్ల 20 లక్షలు, ఉత్తరాంధ్ర లో 22 కోట్ల రూపాయిలను రాబట్టి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే, ఈ సినిమా శివరాత్రి వరకు థియేట్రికల్ రన్ ని హోల్డ్ చేయగలిగితే, నైజాం ప్రాంతం లో 50 కోట్లు, సీడెడ్ లో 23 కోట్లు, ఉత్తరాంధ్ర లో 24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అదే విధంగా ఉభయగోదావరి జిల్లాలు కలిపి ఈ చిత్రానికి మూడు వారాల్లో 23 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, నెల్లూరు జిల్లాలో 4 కోట్ల 62 లక్షలు, కృష్ణ జిల్లాలో 10 కోట్లు గుంటూరు జిల్లాలో 11 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి.
మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 130 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 210 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా లో 9 కోట్లు, ఓవర్సీస్ లో 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 156 కోట్ల రూపాయిలు వచ్చింది. ఇంకో నాలుగు కోట్లు రాబడితే ప్రాంతీయ బాషా చిత్రాల్లో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పిన సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించిన సినిమాగా రికార్డ్స్ కి ఎక్కనుంది. ఇదంతా పక్కన పెడితే అన్ని ప్రాంతాలకు దిల్ రాజు ‘గేమ్ చేంజర్’ తో పాటు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని కూడా ఒకే డిస్ట్రిబ్యూటర్ కి అమ్మాడు. గేమ్ చేంజర్ నుండి నష్టపోయిన బయ్యర్స్ అందరూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో లాభాలను అందుకున్నారు, కానీ తమిళనాడు లో మాత్రం లాభాలు రాలేదని తెలుస్తుంది.